ఈ రోజు అల్పపీడనం ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించింది. ఈరోజు తూర్పు- పశ్చిమ షియర్ జోన్ (గాలి విచ్ఛిన్నతి) సుమారుగా 15°N అక్షాంశం వెంబడి  సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 4.5 కి మి మధ్యన స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు చాలా చోట్ల  రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని  జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.


ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.


దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ 
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక   చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.


రాయలసీమ
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని  చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.


‘‘రాత్రి నుంచి కడప జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేరుగా నెల్లూరు జిల్లాలోని వివిధ భాగాల్లో విస్తరించనున్నాయి. నెల్లూరు నగరంతో పాటుగా నెల్లూరు జిల్లా కోస్తా భాగాలు, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు 100 శాతం కనిపిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.