Weather Latest News: నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని మరికొన్ని భాగాలు.. మొత్తం ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్, తూర్పు బంగాళాకాతంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు మీదుగా ఈ రుతుపవనాలు విస్తరించాయి. 




ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
ఈ ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శీతల గాలులు వీయనున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా  గాలులు వీయనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ గాలుల వేగం కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని పేర్కొన్నారు.






తెలంగాణలో వాతావరణం ఇలా..
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. 






భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుందని, నగరంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని చెప్పారు. కనిష్ఠ గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 38 డిగ్రీలుగా ఉంటుందని చెప్పారు. గాలులు గంటకు 10 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో ఉంటుందని ట్వీట్ చేశారు.