నిన్న దక్షిణ చత్తీస్ గడ్, పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం, నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడి, సగటు సముద్రం మట్టం నుంచి 2.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలోని కొన్ని (తూర్పు , పశ్చిమ) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 86 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
సెప్టెంబరు 29 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం & పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం & దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత, ఇది క్రమంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణవిభాగం వెల్లడించింది.
ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి ఇపుడు బల హీన పడినది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో గల ఉపరితల అవర్తనం ఇపుడు బలహీన పడిందని తెలిపారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.