ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (ఆగస్టు 25) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 77 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


ఉత్తరాదిలో చురుగ్గా రుతుపవనాలు
ఢిల్లీలో ఉష్ణోగ్రత కూడా సగటు కంటే తక్కువగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఢిల్లీలో నేటి వాతావరణం స్పష్టంగా ఉండడమే కాకుండా, కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుంది. భారత వాతావరణ విభాగం ప్రకారం, రాబోయే 24 గంటల్లో అత్యల్ప వర్షాలు ఉండే అవకాశం ఉంది.


అధికారులు ప్రకటించిన ప్రకారం.. నగరంలో గత 24 గంటల్లో, గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 24.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే గత రెండు రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. సోమవారం మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత 38.1 డిగ్రీలకు చేరుకుంది. ఆగస్టు నెలలో ఇది గరిష్ట ఉష్ణోగ్రత. మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా తేమ, వేడి నుండి ప్రజలు ఉపశమనం పొందారు. రానున్న ఐదు రోజుల పాటు అంటే ఆగస్టు 30 వరకు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఉష్ణోగ్రతలు ఇలా
రిడ్జ్ ప్రాంతంలో అత్యల్ప గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మయూర్ విహార్‌లో 27.1, జాఫర్‌పూర్‌లో 28.5 డిగ్రీల సెల్సియస్, లోడి రోడ్‌లో 28.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. IMD ప్రకారం, మయూర్ విహార్‌లో రెండు రోజుల క్రితం గరిష్టంగా 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు పితంపురలో 9, రిడ్జ్ ప్రాంతంలో 8.2 మి.మీ వర్షం నమోదైంది.