Weather Latest News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడనున్నాయని అంచనా వేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు, రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే నేడు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో..
ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. నేడు రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


రాయలసీమలో..
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రోజూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.




Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ సహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెబ్ సైట్‌లో వెల్లడించారు.




హైదరాబాద్, పరిసర ప్రాంతాల వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు మరియు 24 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు, గాలివేగం గంటకు 8 నుంచి 12 గంటల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.