నిన్న  ఆగ్నేయ  బంగాళాఖతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఆవర్తనం ఈరోజు అదే ప్రదేశంలో స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  అక్కడక్కడ, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


ఈ రోజు ఆగ్నేయ  బంగాళాఖతం & పరిసరాలలో  సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 5.8 కిమీ ఎత్తు మధ్య ఉన్న ఆవర్తనం క్రమంగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 4, 5, 6 తేదీలలో తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4,5 తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది.


ఈ నెల 5వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.


తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


‘‘ఎట్టకేలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా జూలై 4, 5 న మధ్య ఆంధ్ర జిల్లాలు - బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడ తో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ​, ఏలూరు, ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు, నంధ్యాల​, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కచ్చితంగా ఉండనుంది. మిగిలిన జిల్లాలు - విశాఖ​, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మణ్యం, నెల్లూరు, తిరుపతి, కడప​, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలం’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.