Weather Latest News: ఆగస్టు 8న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న గంగేటిక్ పశ్చిమ బెంగాల్, పరిసర ఝార్ఖండ్ - ఉత్తర ఒడిశా వద్ద కొనసాగిన ఆవర్తనం ఈరోజు పశ్చిమ ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకు వంగి వున్నది. నిన్న రాయలసీమ నుండి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగిన ఉత్తర - దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడింది. ప్రధానంగా కింది స్థాయి గాలులు పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, రేపు కొన్నిచోట్ల,  మరియు ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజు, రేపు  తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.       


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.6 డిగ్రీలుగా నమోదైంది. 92 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నిన్నటి రోజున ఝార్ఖండ్, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, ఛత్తీస్ గఢ్ పైగల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తక్కువగా గుర్తించారు.


ఆగస్టు 8న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.