Warangal Pickle Mart: పచ్చడి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఇక వేడివేడి అన్నంలోకి అవకాయ పచ్చడి కాంబినేషన్ కున్న క్రేజే వేరు. కెమికల్స్ లేకుండా తయారుచేసే రుచికరమైన పచ్చళ్లకు మరింత డిమాండ్ ఉంటుంది. అలాంటి వెజ్... నాన్ వెజ్ పచ్చళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇళ్లలో తయారు చేసుకునే విధంగా వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు 60 రకాల పచ్చళ్లు స్వాగతం పలుకుతున్నాయి. వరంగల్ లోని ఈ పచ్చడి స్టోర్ గురించి ఇక్కడ తెలుసుకుందామా.
60 రకాల వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు..
ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్ పేరు పికిల్ మార్ట్. వరంగల్ సిటీ బాలసముద్రంలో ఈ పిక్లీ మార్ట్ ఉంది. ఇందులో వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు వరంగల్ నగర ప్రజలను నోరూరిస్తున్నాయి. ఈ షాప్ యజమాని పేరు విజయ్. ఉద్యోగం, ఉపాధి కోసం వెతుకుతున్న సందర్భంలో ఆన్లైన్లో పికిల్ మార్ట్ పచ్చళ్ళ బిజినెస్ కనిపించింది. తక్కువ పెట్టుబడితో వ్యాపారం సాగే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన పిక్లీ మార్ట్ ఔట్ లెట్ ను తీసుకొని వరంగల్ నగర ప్రజలకు వివిధ రకాల పచ్చళ్ల రుచి చూపిస్తున్నారు.
పికిల్ మార్ట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి ఆదరణ పెరిగింది. ఈ పిక్లీ మార్ట్ లో 60 రకాల వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లతో పాటు వివిధ రకాల కరివేపాకు పొడి, మిర్చి పొడి, అల్లం పొడి లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు స్వచ్ఛమైన తేనెను కూడా విక్రయిస్తున్నారు. ఈ పచ్చళ్లను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సహజ సిద్ధంగా తయారుచేసి పాతకాలం నాటి జార్లలో నిల్వచేసి విక్రయానికి సిద్ధంగా ఉంచుతారు. ఈ పచ్చళ్లలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇండ్లల్లో తయారు చేసుకున్నట్టు చేస్తారు. మటన్, చికెన్, చేపలు, పీతలు, రొయ్యలతో పాటు వెజ్ లో గోంగూర, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ తదితర పచ్చళ్ళును పిల్లలు, పెద్దల రుచికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. ఇక పచ్చళ్ల ధరల విషయానికి వస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. ప్రజల రుచికి అనుగుణంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా వాడే కారం, పల్లినూనె, సుగంధ ద్రవ్యాలను వాడి పచ్చళ్లు తయారుచేసి భద్రపరుస్తున్నారు.
వరంగల్ నగరంలో మొదటిసారి..
వరంగల్ నగరంలో 60 రకాల పచ్చళ్ళు ఒకే దగ్గర లభించడం మొదటిసారి. ప్రజలు ఊహించలేని విధంగా రకరకాల పచ్చళ్ళ అందుబాటులో ఉండడంతో పచ్చల ప్రియులు వారికి నచ్చిన పచ్చలను తీసుకువెళ్తున్నారు. ఒక్కసారి వచ్చిన ప్రజలు పచ్చళ్ళ రుచి నచ్చడంతో మళ్లీ మళ్లీ వచ్చి తీసుకెళ్తున్నారు. అయితే వరంగల్ నగర ప్రజలే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడ్డ వరంగల్ ప్రజలు పిక్లీ మార్ట్ నుంచి ఆర్డర్ పై పచ్చళ్ళను కొనుగోలు చేసి విదేశాలకు తీసుకువెళ్తున్నారు. వరంగల్ నగరంలో అయితే ఆర్డర్ పై 50 రూపాయలు అదనంగా చార్జి తీసుకొని సప్లై చేయడం కూడా జరుగుతుంది ఈ పచ్చళ్ళు పిల్లలు పెద్దలు వృద్ధులు తినే విధంగా ఉండడంతో తీసుకువెళ్తున్నామని పచ్చల ప్రియులు చెప్తున్నారు. పచ్చళ్ళ కోసం ఈ షాప్ నకు రావడం రెండవసారని అన్ని వయసు వాళ్లకు పచ్చళ్ళు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఓ కస్టమర్ శోభ చెప్పారు. ఈ పచ్చళ్ళు స్థానిక ప్రజల కే కాకుండా విదేశాల్లో ఉన్న వారికి సైతం ఆర్డర్ పై పంపిస్తున్నామని పికిల్ మార్ట్ యజమాని విజయ్ తెలిపారు. వరంగల్ లో పచ్చళ్ళ వ్యాపారం కొనసాగుతుందో లేదో అనుకున్నాను కానీ మంచి ఆదరణ లభిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
పికిల్ మార్ట్ లో పచ్చళ్ల ధరలు ఇలా..
వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు పావు కేజీకి ధరలు..
గోంగూర 135 రూ....
నిమ్మకాయ 135 రూ....
టమోటా 135 రూ..
చింతపండు 135 రూ..
పుధినా 135 రూ...
అమల 135 రూ...
దబ్బకాయ్య 135 రూ...
మునగ 135 రూ..
కాకరకాయ 135 రూ...
నాన్-వెజ్ (250G)
బోన్‌లెస్ చికెన్ 275రూ .....
బోన్ లెస్ మటన్ 450రూ...
బోన్ లెస్ మటన్ గోంగూర 450రూ...
చెరువు చేప 275రూ ....
చికెన్ 225రూ....
కొరమీను చేప 300రూ...
పెద్ద రొయ్యలు 400రూ...
మటన్ ఖీమా గోంగూర 400రూ...
మటన్ ఖీమా 440రూ...
మటన్ 390రూ..
చిన్న రొయ్య 350రూ..
నాట్టుకోడి 300రూ..
నాట్టుకోడి గోంగూర 300రూ...
బోన్‌లెస్ చికెన్ గోంగూర 275 రూ..
చికెన్ గోంగూర 225 రూ...
పెద్ద రొయ్యల గోంగూర 400రూ...
వివిధ రకాల పొడులు...
కారప్పొడి. (100గ్రా)
కరివేపాకు 55 రూ...
డ్రై ప్రాన్ 65 రూ...
వెల్లుల్లి 55రూ...
ఇడ్లీ కారం 55 రూ....
కాకర 55 రూ..
మునగాకు 55రూ...
బియ్యం పొడి 55 రూ...
వేరుశెనగ 55 రూ..
ప్రత్యేక వస్తువు (1KG)
స్వచ్ఛమైన తేనె 660 రూ.