BJP surge in Old city says bandi sanjay | బీజేపీ హైదరాబాద్ ఓల్డ్ సిటీని స్వాధీనం చేసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం బిజెపికి పాటుపడుతుందనన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న సంఘ విద్రోహక శక్తులను నామ రూపాలు లేకుండా చేస్తామని బండి సంజయ్ అన్నారు. హన్మకొండలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన bjp సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరితో సభ్యత్వ నమోదు చేయించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో 18 కోట్ల సభ్యత్వాలు ఉన్న ఏకైక పెద్ద పార్టీ బిజేపి అని బండి సంజయ్ అన్నారు.
హైడ్రా... ఒక డ్రామా..
హైడ్రాకు బిజెపి వ్యతిరేకం కాదని.. చెరువులు, కుంటలు కబ్జాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టవద్దని బండి సంజయ్ అన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల పొట్టకొడితే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రైతు రుణ మాఫీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. దాన్ని పక్కదారి పట్టించడం కోసం రేవంత్ రెడ్డి హైడ్రా అనే డ్రామాను లేవనెత్తారని బండి సంజయ్ ఆరోపించారు.
Brs విలీనంపై బండి సంజయ్ క్లారిటీ
బిజెపి బీఆర్ఎస్ కు సంబంధాలే లేదని. గూలాబీ పార్టీ బీజేపీలో చేరడం అనేది అసాధ్యమని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని రెండు పార్టీ లకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. బిజెపి కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కాదని. బీఆర్ఎస్ విలీనం అనేది ఆసాధ్యమని, ఒకవేళ విలీన ప్రస్తావన వస్తే కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఆ కుటుంబం మొత్తానికి బీజేపీ టికెట్లు ఇస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలకు కాబట్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని భవిష్యత్తులో అదే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెద్దేవా చేశారు.
కవిత బెయిల్ పై ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వాలు, వ్యక్తులు చెబితే సుప్రీంకోర్టు ఎవరికీ బెయిల్ ఇవ్వదని బండి సంజయ్ అన్నారు. కవిత డాటర్ ఆఫ్ ఫాదర్ కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయలేదన్నారు. ఇదంతా కవిత బెయిల్ కోసమేనన్నారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి మద్దతిచ్చారని అన్నారు. అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ కాదని కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ లీకులు..
కవిత జైల్లో నుండి రాగానే కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని లీకులు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఏం ఉద్ధరిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం... దుకాణం బంద్ అయిందన్నారు. స్థానికల సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలను చేతులెత్తమంటే ఎవరు ఎత్తడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. 2028లో అధికారంలోకి వచ్చే పార్టీ బిజెపి అన్నారు
రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి
64 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందని.. ఇందుకు 49 వేల కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. తర్వాత మాట మార్చి అసెంబ్లీలో 31 వేల కోట్లు మంజూరు చేస్తామన్నారని, చివరకు రేవంత్ రెడ్డి 17 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతులను మోసం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.