Station Ghanpur Politics: ఫిబ్రవరి 3వ తేదీన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారులు తెర్చుకోవడం లేదు. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టచ్ లో ఉంటూనే ఉన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. అయిన పార్టీలో చేరికపై ఒక క్లారిటీ రాలేదు.


అయితే తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర అధిష్టానానికి వినతి పాత్రలు ఇవ్వడంతోపాటు ఆందోళన చేస్తున్నారు. రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుండగానే స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ లోకి రాజయ్య ను తీసుకోవద్దని బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాకుండా రాజయ్య తన ప్రయత్నాలు చేస్తుండడంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మహిళ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ భవన్ ముందు నిరసన తెలిపి పార్టీ పెద్దలకు సైతం వినతి పత్రాన్ని అందజేసే వచ్చారు. 


అయినా రాజయ్య తన ప్రయత్నాలను ఆపకుండా పదేపదే ముఖ్యమంత్రిని కలుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి చెందిన మహిళ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజయ్య కాంగ్రెస్ లో చేరాడని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కొంత మంది మహిళా నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనస్సు మార్చు కావాలని మేడారం జాతర్లకు జాతరకు బయలుదేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనసు మార్చుకోవాలని రాజయ్యకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దనే ఫ్లెక్సీ తో మేడారం వనదేవత లకు మొక్కులు చెల్లించుకున్నారు.


ఓవైపు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు అధిష్టానం పై ఒత్తిడి.. రాజయ్య పదేపదే ముఖ్యమంత్రి ని కలిసిన చేరిక పై ఒక క్లారిటీ రాకపోవడంతో రాజయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డారు.