Medaram Jatara Online Services: 2024 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక స్పెషల్ గా చెప్పవచ్చు. ఆదివాసి గిరిజన జాతరలో ఈసారి కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. మేడారం భక్తుల సౌకర్యం కోసం స్మార్ట్ సేవలు ఆవిష్కరించింది. భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఒకటైతే.. వనదేవతల ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆన్ లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. 


ములుగు జిల్లా మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగే ఆదివాసి గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర జరగనుంది. గిరిజన జాతర మేడారం కు గిరిజనులతో పాటు గిరిజనేతర్లు మొక్కులు చెల్లించుకుంటారు వనదేవతలకు ప్రధాన ముక్కు బెల్లం. జాతరకు తరిలివచే ప్రతి భక్తుడు ఎంతో కొంత అమ్మవార్లకు బంగారం (బెల్లం) మొక్కుగా చెల్లించుకావడంతోపాటు బంగారాన్ని పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. అయితే జాతరకు రాలేని వారు భక్తులు వనదేవతల బంగారం పొందేందుకు దేవాదాయశాఖ ఆన్ లైన్ సేవలను ప్రారంబించింది. 


దేవాదాయ శాఖ, ఆర్టీసీ కార్గో సౌజన్యంతో భక్తులకు ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఈ సేవలను ఈ నెల 14 వ తేదీ నుంచి 25వ తేదీ నుంచి బుకింగ్ సేవలు కొనసాగుతాయి. ప్రసాదాన్ని పొందాలనుకునే వారు దేవాదాయ శాఖ వెబ్ సైట్ లోకి వెళ్ళే శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రసాదం అనే ఆప్షన్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆర్టీసీ కార్గో Paytm తో ఒప్పందం కుదుర్చుకుంది. Paytm యాప్ ఓపెన్ చేసి ఈవెంట్ లోకి వెళ్ళగానే సమ్మక్క ప్రసాదం ఆప్షన్ ఉంటుంది. అందులో అడ్రస్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలని ఆర్టీసీ కార్గో అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు.


వనదేవతల దర్శనానికి వీలుక మొక్కులు చెల్లించాలనుకునే భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. దేవాదాయ శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి సమ్మక్క సారలమ్మ జాతర బంగారం సేవ ఆప్షన్ లోకి వెళ్లి బరువుతో పాటు కిలో కు 60 రూపాయలు చెల్లించాలని మేడారం ఈఓ రాజేంద్రం చెప్పారు. ప్రసాదం పొందాలనుకునే వారు ఆర్టీసీ కార్గో, మీసేవ, పోస్టల్ శాఖ నుంచి పొందవచ్చని ఆయన తెలిపారు.