Road accident at Maripeda on Warangal Khammam Highway | ఖమ్మం - వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు కుడియా తండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లతోపాటు లారీ క్లీనర్ చనిపోయాడు. మంటల్లో వారు సజీవదహనం అయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Road Accident: ఖమ్మం- వరంగల్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవదహనం
Shankar Dukanam | 04 Jul 2025 08:58 AM (IST)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
ఖమ్మం- వరంగల్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవదహనం