ప్రధాని వరంగల్ పర్యటన సందర్భంగా భిన్నమైన ప్రతిభ చూపిన ఓ వ్యక్తిని మోదీ మెచ్చుకున్నారు. ఆ వ్యక్తి విభిన్న ప్రతిభావంతుడు. పేరు కామిశెట్టి వెంకట్. ఆటిజంతో బాధపడుతున్న ఆ వ్యక్తిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కామిశెట్టి వెంకట్ ప్రతిభ యువశక్తికి ఒక పవర్‌ హౌస్ అంటూ మోదీ కొనియాడారు. వరంగల్ సభ జరుగుతున్న వేల ప్రధాని మోదీ ముందు ఆటిజంతో ఇబ్బంది పడుతున్న కామిశెట్టి వెంకట్ డ్యాన్స్ చేశాడు. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాడు. అనంతరం కామిశెట్టి వెంకట్ కుటుంబం ప్రధాని మోదీని ప్రత్యేకంగా కూడా కలిసింది.


వరంగల్ పర్యటన ముగిసిన తర్వాత దీని గురించి ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయిందని, నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు  డ్యాన్స్ కూడా చేశాడని ట్వీట్ లో అన్నారు. కామిశెట్టి వెంకట్  మనోధైర్యానికి సెల్యూట్ అంటూ మోదీ అతణ్ని అభినందించారు.


‘‘అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు, యువశక్తికి ఒక పవర్‌హౌస్. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయింది, పాడటాన్ని కొనసాగించాడు. నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు నృత్యం కూడా చేశాడు. ఆయన మనోధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు.