Vanajeevi Ramaiah Passes Away | ఖమ్మం: పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో పద్మశ్రీ పురస్కార గ్రహీత రామయ్య మృతి చెందారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో వనజీవి రామయ్యను గౌరవించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
మొక్కలు, చెట్లపై ఉన్న ప్రేమతో తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్న ప్రకృతి ప్రేమికుడు ఆయన. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. జీవితమంతా మొక్కలు నాటడంతో పాటు వాటి పెరుగుతల కోసం ఎంతగానో శ్రమించారు. ఆయన జీవితంలో కోటిగాపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించిన అరుదైన వ్యక్తి ఆయన.