Minister Errabelli: తెలంగాణ రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ అక్కా చెల్లెళ్లకు, అమ్మలకు ఒక అన్నగా, తమ్ముడిగా, ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బతుకమ్మ చీరల విలువ చూడకూడదని.. కేవలం సీఎం కేసీఆర్ వాటిని అందించే వెనుక ఉద్దేశం, ప్రేమను మాత్రమే చూడాలన్నారు. కొంతమంది కావాలనే ప్రేమగా ఇచ్చిన బతుకమ్మ చీరలను కాల్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అలా చేస్తే అస్సలే ఊరుకోబోమన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చీరలు నచ్చకపోతే వాపస్ ఇవ్వాలనే కానీ వాటినే కాల్చకూడదని సూచించారు. వాటి ధరను, విలువను చూడొద్దని చెప్పుకొచ్చారు. 


కార్పొరేటర్లు, అధికారులు అంతా కలిసి బతుకమ్మ చీరలు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీన్ని కూడా రాజకీయం చేసే కొంత మందికి తాను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానని. తల్లికో, తండ్రికో వచ్చే పింఛన్ తిరిగి ఇచ్చేయాలని సూచించారు. లేదంటే రైతుబందో, రైతుబీమానో రివర్స్ చేయమనండి. ఆ చీర ఇచ్చింది రేటు గాదు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తండ్రిగా ప్రభుత్వం బహుమానంగా ఇస్తుందన్నారు. అది గుర్తించనోడు మూర్ఖుడు అన్నట్టే. అది ఎంత విలువ అనేది కాదని, కావాలని కొంత మంది చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఎక్కడన్నా బతుకమ్మ చీరలు కాలబెడితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు సూచించారు. బతుకమ్మ చీరలు వాళ్లకు ఇష్టం లేకపోతే వాపస్ చేయాలే. కానీ ఇలా కాలబెడితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఆదేశించారు. ఇష్టం లేకపోతే తీస్కోకుర్రి. అందులో ఏముందన్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చే స్కీంలను కూడా వద్దని చెప్పాలని, కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లకు చెప్తున్నం. చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడా లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా పండుగకు చీరలు ఇస్తున్నామని, దీని వల్ల ఎంతో మంది చేనేత కార్మికులకు పని దొరుకుతుందతన్నారు.


హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దసరా, బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, మిగతా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ చీరలు నచ్చితే తీసుకోవాలని లేకుంటే వదిలివేయాలని చెప్పారు. అంతేగాని లేనిపోని రాజకీయ చేయడం తగదన్నారు. లేనిపోని కారణాలు చెప్తూ కావాలని బతుకమ్మ చీరలను కాలిస్తే మాత్రం కఠఇన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు.  


ఈసారి కోటి చీరలు..


ఈ సంవత్సరం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాది గతంలో కన్నా  మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగులు, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్ టైల్స్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిథుల అభిప్రాయాలు, అసక్తులు, నిఫ్ట్ డిజైనర్లల సహకారంతో , అత్యుత్తమ ప్రమాణాలతో, వెరైటీ డిజైన్లతో చీరలు ఉత్పత్తి చేశారని తెలిపారు.  ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను నూతన డిజైనులతో ఉత్పత్తి చేశామన్నారు. నిన్నటి నుంచి అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ ఏడు బతుకమ్మ చీరల ఖర్చు 339. 73 కోట్లు..


6 మీట్లర్ల(5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92 లక్షల సాధారణ చీరలతోపాటు.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించామని వివరించారు. మొత్తం కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందిచనున్నట్లు తెలిపారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కోసం ఈ సంవత్సరం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా (ఈసంవత్సరం కలుపుకుని) సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా అందించామని కేటీఅర్ తెలిపారు.