Warangal News: ఆయన ఓ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బంగారు రుణాల విభాగంలో విధులు. లక్షల్లో జీతం. జూదానికి అలవాటు పడ్డాడు. ఇంకేముంది జీతం, ఆస్తి అన్నీ కరిగిపోయాయి. అప్పులు కూడా చేశాడు. బ్యాంకు ఉద్యోగి కదా అడగ్గానే అందరూ అప్పులు ఇచ్చారు. అవి కూడా ఆన్‌లైన్ జూదంలో పోగొట్టాడు. కాలం గడిచేకొద్ది అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. 


ఏకంగా బ్యాంక్‌కే ఎసరు పెట్టాడు. అంతా తన చేతిలో పని. ఇంకేముంది ప్లాన్ అమలు చేశాడు. ఏకంగా 128 మంది పేర్లతో ఖాతాలు తెరిచాడు. వారందరి పేరుతో రూ.8,65 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే మోసం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా! అంతే బ్యాంకు నిర్వహించిన ఆడిటింగ్‌లో అధికారి అవినీతి వెలుగులోకి వచ్చింది. ఉద్యోగి చేసిన మోసం తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు. ఈ మోసం వరంగల్ జిల్లాలో జరిగింది.


వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో బైరిశెట్టి కార్తీక్‌  డిప్యూటీ మేనేజర్‌‌గా పనిచేస్తున్నాడు. బంగారు రుణాల విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన గోల్డ్​లోన్​, రెన్సువల్స్​, ముగింపు చూసుకుంటాడు. కార్తీక్‌ ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. వచ్చే జీతంతో పాటు, ఆస్తి అన్నీ పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా అప్పులు చేసి జూదం ఆడాడు. వాటిని కూడా ఆన్‌లైన్ జూదంలో పోయాయి. దీంతో కార్తీక్ మీద అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పులు తీర్చేందుకు తాను పనిచేస్తున్న బ్యాంకును మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. 


ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. బంగారం రుణ ఖాతాదారులు డబ్బులు తీసుకొని బ్యాంకుకు రికవరీ కింద వచ్చిన వారి మొత్తం డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా.. కేవలం వడ్డీ మాత్రం జమచేసేవాడు. ఆ మొత్తాన్ని తాను బినామీ ఖాతాలో వేసుకునేవాడు. అంతే కాకుండా అధికారికంగా రుణ ఖాతాను క్లోజ్​ చేయకుండా.. ఆభరణాలు మాత్రం ఖాతాదారునికి ఇచ్చేసేవాడు. 


దీంతో ఖాతాదారులు ఎవరి ఫిర్యాదు చేయలేదు. బ్యాంకులో గోల్డ్ ఖాతా ఇంకా చెలామణిలోనే ఉన్నట్లు చూపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇలా తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. ఏకంగా రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. బ్యాంకును తప్పుదోవ పట్టించి.. పక్కాగా రుణ అకౌంట్స్​ క్లోజ్​ అయ్యేలా ప్లాన్​ చేశాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలు తెరిచినట్లు వినిదయోగదారులకు తెలియడంతో ఆందోళన వ్యక్తం చేశారు.  


గత ఏడాది బయటపడింది
గత ఏడాది ఆగస్టు 14న బ్యాంకు ఆడిటింగ్​ అధికారులు ఖాతాలను చెక్​ చేయడంతో.. రూ.8.65 కోట్ల మేర అవకతవకలు జరిగాయని గుర్తించారు. ఈమేరకు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిప్యూటీ మేనేజర్​ కార్తీక్​ చేసిన మోసాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కార్తీక్ పారిపోయాడు. సంవత్సరం పాటు గాలింపు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు.


విచారణలో బ్యాంకులో తాను చేసిన చేసిన మోసాల చిట్టా విప్పాడు కార్తీక్. 2019 నుంచి 2023 ఆగస్టు వరకు నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో మొత్తం 128 మంది ఖాతాదారులను వాడుకొరూ.8.65 కోట్ల మోసానికి పాల్పడినట్లు చెప్పాడు. ఆ డబ్బును ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​లలో పెట్టి పోగొట్టుకున్నాడని పోలీసులకు తెలిపాడు. సదరు బైరిశెట్టి కార్తీక్​ను రిమాండ్​ చేసి.. విచారణ వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.


వారికి బ్యాంకు అధికారులు, పోలీసులు వివరణ ఇస్తూ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరకు బ్యాంకుల్లో కూడా సొమ్ముకు భద్రత లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.