OU Lecturer Posts: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా

OU Lecturer Posts: ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మాస్టర్స్ తో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

Continues below advertisement

OU Lecturer Posts: 

Continues below advertisement

ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారికి 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో బయోడేటా పూర్తి వివరాలతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది.

వివరాలు..

పార్ట్ టైమ్ లెక్చరర్: 16 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

1) ఎంబీఏ: 01

2) ఎంసీఏ: 01

3) ఎంఎస్సీ(కెమిస్ట్రీ): 12 

4) ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్): 01

5) ఎంఏ(ఎకనామిక్స్): 01 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారికి 60 శాతం మార్కులు ఉండాలి. 

వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరితేది: 15.09.2023.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
Office of the Director, 
District PG Colleges, 
Osmania University, Hyderabad.

Notification

Website

ALSO READ:

హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement