- నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకుందాం
- రాత్రి 9 గంటల నుంచి ఉదయం 3 వరకు ముమ్మర తనిఖీలు
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్
వరంగల్ : నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ప్రజలకు సూచించారు. తీపి గుర్తులతో గడిచిపోతున్న 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న 2023 సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటించాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహించడంతో పాటు డ్రంక్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం ట్రై నీటి పరిధిలో మొత్తం యాభైకి పైగా వాహన తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 


మైనర్లకు వాహనాల డ్రైవింగ్ ఇవ్వొద్దు 
మద్యం సేవించి వాహనం నడపరాదని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహన డ్రైవింగ్ అనుమతించకూడదని, ట్రిబుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలను నడపడంతో పాటు సైలెన్సర్ తొలగించి వాహనాలను నడపటం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే వాణిజ్య సముదాయాలు నిర్ధేశించిన సమయానికి మూసివేయాలని, డీజేలు, ఇతర శబ్ధ కాలుష్యాన్ని ఏర్పరిచి ఇతరులకు ఇబ్బంది కలిగించే వాటికి అనుమతి లేదని కమిషనర్ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రమాదం పొంచి ఉన్నందున పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోరాదని, కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పు వున్నందున వీలైనంత వరకు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కల్పి సంతోషాల నడుమ ఇండ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వారికి నూతన సంవత్సర శు భాకాంక్షలను తెలియజేశారు.


డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ. 10 వేల ఫైన్ 
హైదరాబాద్ సైతం న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ముగియనున్న 2022కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు మందుబాబులు సిద్ధమయ్యాయ. అయితే మందుబాబులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు హైదరాబాద్ పోలీసులు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ. 10 వేల ఫైన్ విధిస్తామని తెలిపారు. దీంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకల జోష్ లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిఫుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్‌, లంగర్‌హౌస్‌ మినహా అన్ని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.


పట్టుబడితే రూ.10 వేల ఫైన్  
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చట్ట ప్రకారం చ‌ర్యలు తీసుకుంటామ‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఫస్ట్ టైం రూ.10 వేలు ఫైన్, 6 నెల‌లు జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జ‌రిమానా, 2 సంవ‌త్సరాల జైలు శిక్ష త‌ప్పద‌ని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రైవింగ్ లైస్సెన్స్ సీజ్ చేసి స‌స్పెన్షన్‌కు ర‌వాణా శాఖ‌కు పంపుతామ‌ని వెల్లడించారు. మొద‌టిసారి 3 నెల‌ల స‌స్పెన్షన్, రెండోసారి దొరికితే పర్మినెంట్ గా లైసెన్స్ ర‌ద్దు చేస్తామని స్పష్టం చేశారు.
వాహనదారులు నిబంధనలు తప్పక పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు.