Telangana News | వరంగల్ లో మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. కానిస్టేబుల్స్ ను వెట్టిచాకిరి చేయిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా కుటుంబానికి దూరం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 


మామునూరు 4వ బేటాలియన్ కు చెందిన కానిస్టేబుల్స్ కుటుంబాలు వరంగల్ ఆర్టీవో కార్యాలయం జంక్షన్ నుంచి మమునూర్ బెటాలియన్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డు పై బైఠాయించారు. కానిస్టేబుల్స్ భార్యలతో పాటు పిల్లలు ప్లకార్డ్ లతో నిరసన తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎక్స్ పోలీస్ సర్వీస్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీస్ లు కానిస్టేబుల్స్ కుటుంబాల ఆందోళనను అడ్డుకున్నారు.


మామునూర్ 4 వ బెటాలియన్ లో కానిస్టేబుల్ నుంచి ఎఎస్సై వరకు సుమారు 15 వందల మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంటివద్ద ఉండనున్నారు. దీంతో భార్య పిల్లలకు దూరంగా ఉండలేక కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఏక్ పోలీస్ సర్వీస్ ను అమలు చేయాలని కానిస్టేబుల్స్ భార్యలు డిమాండ్ చేస్తున్నారు. మా భర్తలు వెట్టి చాకిరి చేయలేక, నెలలో 26 రోజులు ఇంటి వద్ద లేకపోవడంతో విడాకులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్ఠితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.


స్పెషల్ పోలీస్ లో సెక్షన్ కు 10 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. ఇందులో గతంలో వారం నుంచి 10 రోజుల మధ్యలో ముగ్గురు నాలుగు రోజుల పాటు లీవ్ తీసుకొనేవారు. ఇప్పుడు ఒక్కరికి మాత్రమే పరిమిషన్ ఇస్తున్నారు. గతంలో లాగా ఉన్న కొంతవరకు కుటుంబాలతో గడిపే అవకాశం ఉండేదని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఏక్ పోలీస్ సర్వీస్ కొనసాగుతుంది. ఏక్ పోలీస్ సర్వీస్ అంటే నియామక సమయంలోనే సివిల్, ఏ అర్, స్పెషల్ పోలీస్ కాకుండా. ఒకే సర్వీస్ కిందకు తీసుకొని, డిపార్ట్ మెంట్ టెస్ట్ తోపాటు, మూడు సంవత్సరాల కోసారి క్రమశిక్షణ, డ్యూటీ లో ప్రతిభ ఆధారంగా, ఏఅర్, సివిల్ కు కన్వర్ట్ చేస్తారు. తెలంగాణలో కూడా ఏక్ పోలీస్ సర్వీస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.