Warangal News: వరంగల్ లో కడియం శ్రీహరికి హస్తం నేతలు హ్యాండిస్తారా? కడియం కావ్య గెలుపు కష్టమేనా? అంటే వరంగల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు, ఆశావహులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కడియం శ్రీహరి తన కూతురు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు శ్రేణులు కావ్య బరిలో ఉండడాన్ని అంగీకరించడం లేదు.
వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కష్టంగా మారింది. కడియం శ్రీహరి ఆయన కూతురు కాంగ్రెస్ లో చేరడంతో పాటు టికెట్ కేటాయించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కడియం శ్రీహరిని మనస్ఫూర్తిగా అంగీకరించడంలేదు. కడియం కావ్య విజయం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధిష్టాన పెద్దలు చెబుతున్న నేతలు, కార్యకర్తలు మాత్రం ఒప్పుకోవడం లేదు. కడియం శ్రీహరి, కావ్య పై. బహిరంగంగా వసంతృప్తిని వ్యక్తపరచకున్న తెర వెనుక మాత్రం కడియం కావ్య కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
కడియం కావ్య అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుండి ఆశావాహులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ పార్లమెంటు టికెట్ కోసం పదుల సంఖ్యలో పోటీ పడ్డ ప్రధానంగా ఐదుగురు పేర్లు వినిపించాయి. ఎప్పుడైతే కడియం కావ్యకు టికెట్ ఖరారు కావడంతో ఆశావాహులంతా ఒక్కసారి అసంతృప్తి గురై పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని రెండు రోజుల ముందు వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ముఖ్య నేతల వద్ద ఆవేదనను వెళ్లగక్కి దూరంగా ఉంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కడియం కాంగ్రెస్ నేతలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన పార్టీ కోసం పనిచేశామని.. అటువంటి నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటనే అభిప్రాయం ఇంకా కొనసాగుతుంది. అంతేకాదు అదిస్థానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాంటీ కడియం రాజకీయం
కడియం శ్రీహరి తన కూతుర్ని వెంటవేసుకొని మండల, నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి బయటపడుతూనే ఉంది. గెలిచే సీటును అనవసరంగా కడియం కావ్యకు కట్టబెట్టారని నేతలు వారికి వారే చర్చించుకుంటున్నారు. నేతలు సమావేశాలకు వచ్చిన వచ్చామా... వెళ్ళామా అన్న పద్ధతిలోనే ఉంటున్నారు. అయితే కడియం శ్రీహరి, కడియం కావ్య పై రోజురోజుకు అసంతృప్తి పెరుగుతుంది. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు కడియం చేరికపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం నిర్ణయం కావడంతో తప్పని పరిస్థితిలో కడియంతో నడవడం జరుగుతుంది. గెలుపు కోసం ఎవరు ప్రయత్నించే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఓవరాల్ గా యాంటీ కడియం రాజకీయం నడుస్తుంది.
ప్రజల్లో కూడా కడియంపై వ్యతిరేకత పెరుగుతుంది. 10 సంవత్సరాలు పదవులు అనుభవించిన కడియం కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం వచ్చారనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లకు కడియం శ్రీహరి టార్గెట్ గా మారారు. ఎందుకంటే బిజెపి నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆరూరి రమేష్ కడియం శ్రీహరి వల్లనే నాకు బిఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని కోపంతో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు మోసం చేసి కడియం పార్టీ నుండి వెళ్లిపోయారని బీఆర్ఎస్ సైతం కడియం ను టార్గెట్ చేసింది. రెండు పార్టీలకు కడియం ఓటమి లక్ష్యంగా మారింది. అటు సొంత పార్టీలో అసంతృప్తి, ప్రతిపక్షాలకు టార్గెట్ అవ్వడంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత.. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఓటు వేయాలని ఉన్నా కడియం అనే ఒకే ఒక సాకుతో కాంగ్రెస్ ఓట్లు ఇతర పార్టీలకు మల్లె అవకాశం ఉంది. దీంతో కడియం కావ్య గెలుపు కష్టంగా మారుతుంది.