ఛత్తీస్ గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించింది. ఎన్ కౌంటర్‌లో మృతురాలి గుర్తింపు వివరాలను ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మహిళా మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించినట్లు తెలిపారు. ఆమెది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం కాగా, 35 ఏళ్ల క్రితం పార్టీలో వెళ్లారు.
ఉన్నత విద్యను అభ్యసించి అజ్ఞాతంలోకి...
LLB పూర్తి చేసిన రేణుక తిరుపతి లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మహిళా సంఘం లో పనిచేస్తూ 1996 లో అజ్ఞాతంలోకి వెళ్లింది. అంచలంచెలుగా ఎదిగిన రేణుక ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటిగా కొనసాగుతుంది. ఉద్యమంలో మొదట ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కొయ్యూరు ఎన్కౌంటర్ మృతి చెందగా. అనంతరం మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరీనీ గా కొనసాగుతూ వచ్చారు. శాఖమూరి అప్పారావు సైతం 2010 జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ నంబర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
మావోయిస్టు ప్రెస్ లో కీలక భూమిక..
రేణుక మావోయిస్టు పార్టీ కి చెందిన అనేక పత్రికల్లో సేవలందిస్తున్నారు. ప్రభాత్, మహిళా మార్గం, ఆవామి జంగ్, పీపుల్స్ మార్చ్ పత్రికల ప్రచురణలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రభాత్ పత్రిక కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం..రేణుక ఎదవ తరగతి వరకు కడవెండి లో చదువుకుంది. అంతరం రేణుక కుటుంబం మోతుకూరుకు వెళ్ళారు. అక్కడే ఉంటూ ఉన్నంత విద్యను పూర్తి చేసి, ఎల్ ఎల్ బీ కోసం తిరుపతి వెళ్ళారు. రేణుక తండ్రి సోమయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. రేణుక కు ఇద్దరు సోదరులు, ఒక సోదరుడు గుమ్మడి వెళ్లి రాజశేఖర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మరొక సోదరుడు ఊసెండి పేరుతో మావోయిస్టు పార్టీలో కొనసాగి లొంగిపోయారు. ప్రస్తుతం జర్నలిస్టు గా కొనసాగుతున్నారు.
ఉద్యమాల ఖిల్లా కడవెండి.కడవెండి గ్రామం అంటేనే రజాకార్ల గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. అంతేకాదు విప్లవ ఖిల్లా గా పేరుంది. కడవెంది లో ఎటుచూసిన అమ రుల స్థూపాలు కనిపిస్తాయి. రేణుక మరణంతో కడవెండి గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడవెండి గ్రామం నుంచి రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాదులోని బొల్లారం ఉంటున్నట్టు సమాచారం. రేణుక మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఛత్తీస్ ఘడ్ వెళ్తున్నట్టు తెలిసింది. అయితే రేణుక మృత దేహాన్ని కదవెండికి తీసుకువస్తారా లేఖ హైదరాబాద్ తీసుకువెళ్తరా అనేది తెలియాల్సి ఉంది. రేణుక కుటుంబం ఆదర్శ భావాలు గల కుటుంబంగా పేరుంది.