Sammakka Sagar project: తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కారం లభించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌తో సమావేశమయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు రాయ్‌పూర్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో ఛత్తీస్‌గఢ్‌లోని భూభాగాలు ముంపునకు గురి అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెల్లించే నష్టపరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రాజెక్టుకు NOC ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరుగుతోంది.
గోదావరి నదిపై సమ్మక్క సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టు సాగునీటి స్థిరీకరణ, తాగునీరు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించ తలపెట్టారు. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ప్రారంభించారు. ఇది ఇంద్రావతి-గోదావరి లింక్ కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు మొదట 'కంఠనపల్లి బ్యారేజ్'గా ప్రతిపాదించారు. ఇది పీవీ నరసింహారావు కంఠనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లో భాగం 2016లో భూసేకరణ సమస్యలు నివారించేందుకు స్థానాన్ని మార్చారు.
2017 ఫిబ్రవరి 13న నిర్మాణం ప్రారంభమైంది. 2020 ఫిబ్రవరి 13న తుపాకులగూడెం బ్యారేజ్‌ను 'సమ్మక్క బ్యారేజ్'గా పేరు మార్చారు. ఇది సమ్మక్క సరలమ్మ జాతరకు సమీపంలో ఉండటం వల్ల ఈ పేరు పెట్టారు. దీని నిర్మాణ బాధ్యతను రిథ్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఏటూరునాగరం వన్యప్రాణుల అడవి సంరక్షణ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్టు 83 మీటర్ల ఎత్తుతో 1,132 మీటర్ల పొడవుతో 48 రేడియల్ లిఫ్ట్ గేట్లతో నిర్మించనున్నారు.