Kothagudem Airport: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ(Telangana)కు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెంచినట్లు కేంద్రమంత్రులు వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం కోరిన అన్ని ప్రతిపాదనలకు దాదాపు ఆమోదం తెలిపినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం(Airport)పై ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ స్టడీ సైతం పూర్తయ్యిందన్న కేంద్రం..రైల్వే బడ్జెట్‌లోనూ భారీగా కేటాంపులు చేసినట్లు వెల్లడించింది.
భద్రాచలంలో కొత్త విమానాశ్రయం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు పౌరవిమానయానశాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.ఈ మేరకు జనవరిలోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ప్రీ ఫీజిబిలిటీ స్టడీ సైతం నిర్వహించిందని ఆయన తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పాలసీ ప్రకారం అటు తెలంగాణ(Telangana) ప్రభుత్వం గానీ, ఎయిర్‌పోర్టు డెవలపర్ నుంచి గానీ భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు.
గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు(Greanfield Airport) నిబంధనల ప్రకారం భూసేకరణ, పునరావాసం,నిధుల సమీకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గానీ,ఎయిర్‌పోర్టు డెవలపర్ గానీ వహించాల్సి ఉంటుంది. భూసేకరణ, అనుమతుల లభ్యత,ఆర్థిక అంశాలపై ఆధారపడే విమానాశ్రయం నిర్మాణం ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే భద్రాచలం-కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా...రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఎలాంటి కదలిక లేనట్లు ఆయన వెల్లడించారు.
రైల్వే కేటాయింపులుకేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ(Railways)కు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దానికన్నా ఇది 6 రెట్లు అధికమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Aswani vishnaw) వెల్లడించారు. యూపీఏ(UPA) హయాంలో ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఆయన వివరించారు. తెలంగాణలో ఈ దశాబ్ద కాలంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ.41,677కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే విద్యుద్దీకరణ వందశాతం పూర్తయ్యిందన్నారు.
తెలంగాణ చిరకాల వాంఛ అయినటువంటి కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సైతం ఎన్డీఏ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తుచేసిన కేంద్రమంత్రి...దీన్ని మల్టీపర్పస్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 327 కోట్లతో, సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో ఆధునీకస్తున్నట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు 1,326 కిలోమీటర్ల మేర కవచ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని...మరో వెయ్యి కిలోమీటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు.
హైదరాబాద్- విజయవాడకు నమోభారత్‌తెలంగాణకు తొలి దశలోనే వందే భారత్ రైలు కేటాయించినట్లు గుర్తు చేసిన అశ్వనీ వైష్ణవ్...వాటిని 5కు పెంచామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు కేటాయిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్(Amruth Bharath) పథకం కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్-విజయవాడ మధ్య నమో భారత్ (Namo Bharath)రైళ్లు నడపనున్నట్లు వివరించారు.
ఏపీకి భారీగా కేటాయింపులుతెలంగాణతో పోల్చితే ఏపీకీ భారీగా కేటాయింపులు పెరిగాయి.రూ.9,417 కోట్లు రైల్వేకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. యూపీఏ ప్రభుత్వం కేటాయింపులతో పోల్చితే ఇది 11 రెట్లు ఎక్కువ.