Warangal News: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారులోని మోడల్ స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు హరిక ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి ఉపాధ్యాయుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందంటున్న బంధువులు ఆరోపిస్తున్నారు. దోమల రాకుండా ఉండేందుకు ఉపయోగించే లిక్విడ్‌ను తాగి ఆత్మ హత్యయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం నర్సంపేటలోని ఆస్పత్రిలో ఉపాధ్యాయురాలు హారిక చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నికడగానే ఉంది.