వికారాబాద్‌ జిల్లాకు చెందిన మైనర్ బాలిక హత్య, అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్య విషయం వెలుగులోకి రాగానే అదే ఊరిలో ఉండే మైనర్ ప్రియుడు ఆమెను చంపినట్లుగా బయటికి వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా పోలీసుల విషయంలో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆ బాలికను ఆమె తల్లే చంపినట్లుగా భావిస్తున్నారు. విచారణలో భాగంగా చనిపోయిన బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బాలిక హత్య ఆమె ఇంట్లోనే జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటిదాకా నిందితుడిగా భావిస్తున్న మైనర్ ఆ సమయంలో బాలికను కలిసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. హతురాలి తల్లికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు! అదే బాలిక హత్యకు దారి తీసినట్లుగా అనుమానిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Also Read: Rape on Boy: 13 ఏళ్ల బాలుడిపై యువకులు దారుణ రేప్, ఆ తర్వాత మరో పైశాచికం!


మరోవైపు, ఘటన జరిగిన రోజు నిన్న (మార్చి 28) బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం పేదోళ్లం. మేం అడుక్కతిని బతికెటోళ్లము. మా పిల్ల ఈడ చిట్టెంపల్లిల పది చదువుతున్నది. మేమెప్పుడు ఒకల్ల దగ్గరికి పోము. మా బతుకు మేం బతుకుతము. మంచి చెయ్యనికి పోతం గానీ, చెడు చెయ్యము.  ఆ పిల్లగాడు ఫోన్ల మాట్లాడిండు. అతనే చెసి ఉంటడు’’ అని బాలిక తల్లి మాట్లాడారు.


వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడురు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారం చేసి, అంతటితో ఆగకుండా నిందితుడు హత్య కూడా చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బహిర్భూమికి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు.


Also Read: Karimnagar: ఒంట్లో బాలేదని లీవ్ పెట్టిన గవర్నమెంట్ టీచర్ - ఘనకార్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్, అంతా అవాక్కు! 


నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం (Vikarabad Girl Rape) లభ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనకు (Telangana Minor Girl Rape) సంబంధించి ప్రాథమికంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎ‍స్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.