Vijayashanthi rejected the news of party change :  భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం  రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర  విధానం గురించి తాను అభిప్రాయం వ్యక్తం చేశానన్నారు. దానిని  అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్ట్ పై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా  కథనాలు వారే రాసి వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.  అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదని తేల్చేశారు. 


 





 


విజయశాంతి పార్టీ మారుతారని ప్రచారం జరగడానికి ఆమే చేసిన ట్వీటే కారణం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు దాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ ఎప్పటికీ ఉంటుందని ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయం చెప్పారు. క


 





 
కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. అడపాదడపా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి తాజా వ్యాఖలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో అసలు మీరు ఏ పార్టీలో ఉంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. పార్టీ మారబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కామెంట్స్ చేశారు. దానికి విజయశాంతి స్పందించారు. 


కాంగ్రెస్ తీరుపై ఆమె అసంతృప్తిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  విజయశాంతి 1998 లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005 లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009 లో ఆ పార్టీని అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి, ఆమె కూడా అదే పార్టీలో చేరారు. 2009 లో మెదక్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.   తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ బీజేపీ.. మళ్లీ కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుతూ వస్తున్నారు.