VC Sajjanaar: బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు. అందులో మోసపూరిత కంపెనీలకు ప్రచారం చేయొద్దంటూ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్థించారు. సెలబ్రిటీలు ఎరూ ఇలా చేయొద్దని అన్నారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్వవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో క్యూనెట్ లాంటి గొలుసు కట్టు వ్యాపారం చేసే సంస్థలకు సంబంధించిన యాడ్స్ లలో నటించవద్దని, అలాంటి అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. మరోవైపు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీ లెవెన్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్ వేపై 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ... ఆమే వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. 






నెల రోజుల క్రితం సానియా మీర్జాను ట్యాగ్ చేస్తూ ట్వీట్


అయితే నెలరోజుల క్రితం కూడా సజ్జనార్ సానీయా మీర్జాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. క్యూనెట్ లాంటి సంస్థల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. గతంలో సానియా మీర్జాకు సూచించిన సజ్జనార్.. ఇప్పుడు మితాబ్ బచ్చన్ కు ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల తప్పులను కూడా నిర్మొహమాటంగా ఎత్తి చూపుతూ ఉంటారు సజ్జనార్. గతంలో తన సినిమాలో ఆర్టీసీని ప్రమోట్ చేసినందుకు టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ధన్యవాదాలు చెప్పారు, ఆర్టీసీని కించపరుస్తూ ఓ ప్రైవేట్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ పై విమర్శలు కూడా గుప్పించారు. సోషల్ మీడియాలో సజ్జనార్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అనేక అంశాలపై ఎప్పటికప్పడు స్పందిస్తుంటారు. ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ప్రాయాణికుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తుంటారు. ఆయనకు ప్రజల్లో చాలా మంది పేరుంది.