Vande Bharat Train :మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ - బెంగళూరు మధ్య  ఈ నెల 24 నుంచి పరుగులు పెట్టనుంది.  ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య మూడో వందే భారత్ రైలు ప్రారంభం వస్తోంది.               


నిజానికి హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించాలని గతంలో అనుకున్నారు. కానీ వాయిదాలు పడ్డాయి. గత ఆగస్టు పదిహేనో తేదీన  క చిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నారు. సాంకేతిక కారణాలతో చివరికి వాయిదా పడింది.  అయితే తాజాగా ఈ వందే భారత్ ప్రారంభంపై నిర్ణయానికి వచ్చారు.  రైల్వే అధికారులు ధరలను కూడా ఖరారు చేశారు. కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్‌లో టిక్కెట్ ధరాలను కూడా ఖరారు చేశారు.   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు అదికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  


హైదరాబాద్ నంచి  బెంగళూరు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా మంది రైలు టిక్కెట్లు దొరకక.. బస్సుల్లో వెళ్తూంటారు.    కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు స్టేషన్ల మధ్య దాదాపు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో  చేరుకుంటుంది.  అంటే.. సాధారణ రైలుతో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగైదు గంటలు తగ్గుతుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలుస్తోంది.                                            


హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రెండు మార్గాల్లో అనేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, ఒక మార్గం. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం. మరోవైపు, కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా రోజూ ఏడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వారం రోజులు మరియు వారాంతాల్లో చాలా రద్దీగా ఉంటాయి.  అందుకే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ వరకు ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.