Uttam Kumar Reddy Comments: ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కీలక నేతల భేటీ జరుగుతోంది. కేసీ వేణుగోపాల్‌తో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తదితరులు సమావేశమై చర్చిస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై వీరి చర్చలు జరుగుతున్నాయి. 


అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. ఈ ఉదయం ఢిల్లీలో డీకే శివకుమార్ ను కలిశానని, తన అభిప్రాయం ఆయనకు చెప్పానని అన్నారు. తాను కాంగ్రెస్ నుంచే వరుసగా ఏడు సార్లు వరుసగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు. కాబట్టి, సీఎం రేసులో తాను కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. ‘‘మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను.. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా..వారి అభిప్రాయం వారు చెపుతారు’’ అని అన్నారు. అయినా, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవలేదని, అవి కూడా గెలిచి ఉంటే 70 నుంచి 75 స్థానాలు కైవసం చేసుకొనేవాళ్లమని (Uttam Kumar Reddy) అన్నారు.


సీఎం పదవి ఆశించడం తప్పు కాదు - ఉత్తమ్


‘‘సీఎం అభ్యర్థి పరిశీలనలో నేను ఉంటా.. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను.. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా.. వారి అభిప్రాయం వారు చెపుతారు.. హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. సీఎం ఎంపిక విషయంలో  ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం.. ఎక్కడ గందర గోళం లేదు. నేను గతంలో మిలటరీ లో సోల్జర్... కాంగ్రెస్ లోనూ సోల్జర్ ని. కాంగ్రెస్ లో నేను 7 సార్లు గెలిచాను... నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను.. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్నా. గతంలో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా కూడా పని చేశాను.


సీఎం పేరు ప్రకటనలో ఆలస్యం జరగట్లేదు


సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. తప్పు లేదనుకుంటున్నాను. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం లేదు.. రిజల్ట్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయింది. మీడియా సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేసింది. మూడో తేదీన రిజల్ట్స్ వచ్చింది.. 12 గంటల్లో సీఎల్పీ నిర్వహించి తీర్మానం పాస్ చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలియజేశారు. కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను. సీఎం రేసులో నలుగురు ఐదుగురు ఉండటం తప్పు కాదు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడం తప్పు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.