పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) టికెట్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఉగాది పండగ సందర్భంగా ఈ గురువారం (మార్చి 19న) థియేటర్లలోకి సినిమా రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ అయ్యింది. అయితే... తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచలేదు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఏపీలో హైక్ తర్వాత టికెట్ రేట్లు, తెలంగాణలో నార్మల్ రేట్లు ఇంచు మించు ఒక్కటే.

Continues below advertisement

తెలంగాణలో 'ఉస్తాద్...' బుకింగ్స్ షురూ!'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నైజాం టికెట్ బుకింగ్స్ సోమవారం (మార్చి 16వ తేదీ) రాత్రి ఓపెన్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు గరిష్టంగా రూ. 175 అయితే... మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో రూ. 300గా నిర్ణయించారు. రిక్లైనర్ సీట్ రేటు రూ. 350 వరకు ఉంది. 

Also ReadHarish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Continues below advertisement

ఏపీలో 'ఉస్తాద్...' మొదటి బెనిఫిట్ షో  తెలంగాణలో కంటే ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి షో పడుతుంది. అక్కడ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతులు వచ్చాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... ఈ సినిమా మొదటి షో తెలంగాణాలో ఉదయం 7.30 గంటలకు వేయనున్నారు. సో... అమెరికాతో పాటు ముందుగా ఏపీ నుంచి రిజల్ట్ వస్తుంది. 

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అందించగా... తమన్ ఆర్ఆర్ చేశారు. ఉగాదికి థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ