Unidentified people abandoned two thousand chickens in Elkathurthi: సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై శనివారం ఉదయం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. కొందరు అజ్ఞాత వ్యక్తులు ఒక్కటి రెండు కాదు, సుమారు 2,000 నాటు కోళ్లను రోడ్డు మీద వదిలేసి దూరమయ్యారు. ఈ కోళ్లు ఒక్కసారిగా పొలాలు, రోడ్ల చుట్టూ కనిపించడంతో స్థానికులు  వాటిని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు.  ఎవరో కోళ్లను వదిలిపెట్టారని తెలిసిన   గ్రామవాసులంతా వేటగాళ్లుగా మారారు.   చాకచక్యంగా కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు 2-3 కోళ్లతో సంతృప్తి చెందగా ..కొందరు పదుల సంఖ్యలో తీసుకువెళ్లారు.                             దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లి పండగ చేసుకున్నారు కానీ ఎందుకు వదిలేశారన్నది మాత్రం  ఎవరికీ తెలియదు. సాధారణంగా ఫారం కోళ్ల ధరలు కేజీ 250 ఉంటే..  నాటుకోళ్ల ధరలు కేజీకి 800 పైనే ఉంటాయి. మంచి రకానికి చెందినవి అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి. అలాంటిది వ్యాపారులు రెండు వేల కోళ్లను అలా ఊరికే విడిచి పెట్టడం చిన్న విషయం కాదు. కొన్ని లక్షల రూపాయల విలువ ఉంటుంది. ఎంతో కష్టపడి వాటిని పెంచి ఉంటారు. ఎందుకు అలా వదిలి పెట్టారన్నది ఎవరూ తెలుసుకోలేదు.             

Continues below advertisement

కోళ్లను విడిచిపెట్టడం అంటే.. వ్యాన్ లో తీసుకెళ్తూంటే పొరపాటున తలుపు విడిపోయి బయటపడి ఉండాలి. అలా పడి ఉంటే.. వెళ్లే వాళ్లకు తెలుస్తుంది. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ అలాంటి వారు ఎవరూ రాలేదు. తమ కోళ్లే అని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. అంటే వాటిని ఉద్దేశపూర్వకంగా ఎవరో వదిలి పెట్టి ఉంటారు. లక్షలు విలువైన కోళ్లను అలా ఊరికే వదిలేశారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుందని చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. సాధారణంగా కోళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  వాటిని అమ్మకుండా.. ఇలా వదిలేసిపోయి ఉంటారన్న  అనుమానాలు కూడా ఉన్నాయి.                                  

కోళ్లను వేటాడి.. వెంటాడి మరి పట్టుకుని వండుకుని తిన్న ఎల్కతుర్తి గ్రామస్తులకు మాత్రం ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకు వదిలేశారో ఆలోచించలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ మిస్టరీ ఏమిటో తేల్చాలని అనుకుంటున్నారు. కోళ్లలోడుతో వచ్చిన లారీలు, వాహనాల గురించి ఆరా తీస్తున్నారు. పొరపాటున ప్రజారోగ్యానికి  భంగం కలిగించేలా ఏమైనా అనారోగ్య పూరిత కోళ్లు ఏమైనా వదిలారోలేదో తెలుస్తుంది . లేకపోతే ఎందుకు వాడారో స్పష్టత వస్తుంది.