Breaking News Live: తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ ఉగాది శుభాకాంక్షలు

మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి

ABP Desam Last Updated: 02 Apr 2022 03:59 PM

Background

2022 ఏప్రిల్ 2 శనివారం ఉగాదిచైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచబ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. అందుకే...More

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి గుండెపోటుతో మృతి

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌లో చనిపోయినట్లు ఈ మేరకు ఆయన న్యాయవాది తుషార్ ఖండారే తెలిపారు. మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. 


సెయిల్‌కి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డ్రగ్ క్రూయిజ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కేసులో  మరో సాక్షి అయిన కేపీ గోసావికి సెయిల్ సెక్యూరిటీగార్డుగా ఉన్నారు.