TTD  News Guidelines:తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్స్ లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలన్నీ ఏడు కొండల సాక్షిగా టీటీడీ తీరుపై మండిపడ్డాయి. ఈ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.  

తెలంగాణ వాసుల తిరులేశుడి దర్శనం కోసం టీటీడీ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులు మరింత సులభంగా దైవదర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం డిజైన చేసిన పోర్టల్ ద్వారనే సిఫార్సు లేఖలు ఇవ్వాలని పేర్కొంది. దీనికి సంబంధించిన లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (https://cmottd.telangana.gov.in/)  

సిఫార్సు లేఖలు ఇచ్చే ప్రజాప్రతినిధి వివరాలు, తీసుకునే భక్తుల వివరాలు ఆ పోర్టల్‌లో నమదు చేయాలని టీటీడీ సూచించింది. ఆ లేఖను డౌన్‌ లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీయాలని తెలిపారు. సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి మళ్లీ అదే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని టీటీడీ పేర్కొంది.  

డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేసిన వెంటనే టీటీడీ అధికారులకు, భక్తులకు సమాచారం వస్తుందని టీటీడీ అధికారులు వివరించారు. బ్రేక్ దర్శనాలకు టైం కేటాయించారు. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులు మాత్రమే జారీచేయాలని సూచించారు. బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు సోమవారం, మంగళవారం రెండు రోజులే అనుమతి ఇస్తామంటోంది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనం బుధవారం, గురువారం మాత్రమే కల్పిస్తామని తేల్చి చెప్పింది.