How To Pay Electricity Bill Step by Step Process in Telugu: తెలంగాణలో విద్యుత్ పంపిణీని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) నిర్వహిస్తుంది. అత్యున్నత స్థాయి భద్రత, సౌకర్యాలతో వెబ్‌సైట్‌లో విద్యుత్ బిల్లు చెల్లింపు ఆన్‌లైన్‌లో సులభంగా చేయవచ్చు. జూన్ వరకు విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్లులను తమకు వీలైన పద్ధతుల్లో చెల్లించేవారు. కానీ జులై 1 నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లింపులు నిలిపివేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లింపులను TGSPDCL నిలిపివేసింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) అధికారిక వెబ్‌సైట్ లో గానీ, యాప్ ద్వారా మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. ఇప్పటివరకూ థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లించిన వినియోగదారులు ఇక నుంచి ఈ కింద సూచించిన విధంగా సులువుగా కరెంట్ బిల్లు చెల్లించవచ్చు.
TGSPDCL వెబ్‌సైట్‌లో కరెంట్ బిల్లు ఇలా చెల్లించండి
కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఈజీగా కరెంట్ బిల్ కట్టవచ్చు.
* TGSPDCL అధికారిక వెబ్‌సైట్ https://tgsouthernpower.org/ వెళ్లండి
* హోమ్ పేజీలో Consumer Services లో ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్‌కు కుడివైపున కనిపించే పే యువర్ బిల్ (Pay Your Bill) మీద క్లిక్ చేయండి
* ఇప్పుడు, క్రింద ఇచ్చిన ప్లేసులో మీ యూనిక్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* మీరు మీ విద్యుత్ బిల్లును చూపే మరొక పేజీకి వెళ్తుంది. అక్కడ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి
* వివరాలు ఎంటర్ చేశాక మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి, చెల్లింపును ప్రాసెస్ చేయాలి
* చెల్లింపు పూర్తయిన తర్వాత E-రసీదు పొందవచ్చు. దానిని సేవ్ చేసుకోవాలి.
బిల్ డెస్క్ ద్వారా TGSPDCL ఎలక్ట్రిసిటీ బిల్లును ఎలా చెల్లించాలంటే..
మీరు బిల్ డెస్క్ ఆప్షన్‌ని ఉపయోగించి విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు
బిల్ డెస్క్‌ని ఉపయోగించి బిల్లును చెల్లించడానికి కింద స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* 'పే యువర్ బిల్'పై క్లిక్ చేయండి.
* తదుపరి పేజీలో, 'బిల్ డెస్క్'పై క్లిక్ చేయండి.
* తర్వాత, యూనిక్ సర్వీస్ నంబర్, ఇమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
* 'మేక్ పేమెంట్'పై క్లిక్ చేయండి.
* బిల్లు అమౌంట్ మొత్తం తదుపరి స్క్రీన్‌లో కనిపిస్తుంది
* ప్రక్రియను పూర్తి చేయడానికి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
TGSPDCL మొబైల్ యాప్‌తో విద్యుత్ బిల్లు చెల్లింపు విధానం
TGSPDCL అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* మీ ఫోన్‌లో యాప్ లేకపోతే TGSPDCL అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* మొదట TGSPDCL యాప్ ఓపెన్ చేయండి
* కరెంట్ బిల్ కట్టేందుకు మీ యూనిక్ సర్వీసు నంబర్ తో అకౌంట్ ఓపెన్ చేయాలి.
* ఇప్పుడు అప్లికేషన్ స్క్రీన్ నుండి 'పే యువర్ పవర్ బిల్' ఆప్షన్ ఎంచుకోవాలి.
* మీ బిల్లు మొత్తాన్ని పొందడానికి అప్లికేషన్‌పై మీ యూనిక్ సర్వీసు నంబర్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.
* పేమెంట్ ఆప్షన్ లతో పాటు మీరు చెల్లించాల్సిన బిల్లు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు లేదా UPI యాప్‌లతో ఏదో ఒక దానితో పేమెంట్ చేసుకోవచ్చు.
* ఇ-రసీదు వస్తుంది . డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.
విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్‌లైన్‌లో చేయాలంటే..
విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్ లైన్ లో చేయాలనుకునే వారు సమీపంలోని TSSPDCL కార్యాలయం లేదా కలెక్షన్ సెంటర్ కు వెళ్లి చెల్లించవచ్చు. లేకపోతే దగ్గర్లోని మీ సేవా, ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు.