TSRTC MD Sajjanar: హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (Free Tavel For Women In Telangana) అందిస్తున్నారు. ఇక నుంచి (డిసెంబర్ 21 నుంచి) ఒరిజనల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఆడవారికి జీరో టికెట్ జారీ చేస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ (Sajjanar) స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana)లోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాని (Free Bus For Women)కి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అయితే మహాలక్ష్మీ పథకం నిబంధనలు కొందరు పాటించడం లేదన్నారు. కొందరు మహిళలు ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నా రని, స్మార్ట్ ఫోన్‌లలో సాఫ్ట్ కాపీలు చూపిస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరారు. స్మార్ట్ ఫోన్లలో ఐడీ ఫ్రూఫ్ చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అనుమతి ఉండదని సజ్జనార్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డు ల్లో చిన్నతనం నాటి ఫొటోల్లా ఉన్నాయని... వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు
తెలంగాణ మహిళలకు మాత్రమే ఉచిత బస్ ప్రయాణం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని సజ్జనార్ స్పష్టం చేశారు. అర్థం చేసుకుని చాలా చిత్తశుద్ధితో సమర్థ వంతంగా ఈ స్కీంను విజ యవంతంగా అమలు చేస్తో న్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూ ర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యం గా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్‌ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికా దని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు.
త్వరలో 2050 కొత్త బస్సులు
ప్రయాణికుల రద్దీకి అను గుణంగా కొత్త బస్సు లను అందుబాటు లోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందు బాటులోకి వచ్చే ప్లాన్ చేస్తు న్నాం. అందులో 1050 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. విడతల వారీగా ఆ బస్సులు వాడ కంలోకి వస్తాయని సజ్జనార్ తెలిపారు..