తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్  ఫస్టియర్ లో 66.20 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా.. 77.31 శాతంతో మేడ్చల్ అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఫస్టియర్ ఫలితాల్లోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా 49.05 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. ఏయే జిల్లాల్లో ఎంత మంది బాలురు, బాలికలు పరీక్ష రాసి పాసయ్యారు పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Continues below advertisement

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు - జిల్లా వారీ ఉత్తీర్ణత (%)

జనరల్ ఫస్ట్ ఇయర్ – IPE మార్చి 2026

Continues below advertisement
 జిల్లాబాలురు (హాజరు)బాలురు (పాస్)పాస్ శాతంబాలికలు (హాజరు)బాలికలు (పాస్)పాస్ శాతంమొత్తం (హాజరైన వారు)మొత్తం పాస్పాస్ శాతం
1మేడ్చల్358262614772.98300452477782.47658715092477.31
2రంగారెడ్డి420673026671.95380293091181.28800966117776.38
3జయశంకర్ భూపాలపల్లి68845966.7276660378.721454106273.04
4ఖమ్మం7618498165.387681604478.69152991102572.06
5ములుగు81748058.7595778582.031774126571.31
6కరీంనగర్9096568662.517630605179.31167261173770.17
7హనుమకొండ9103561361.668362646577.31174651207869.16
8హైదరాబాద్-I15001914360.95146591079073.61296601993367.20
9కొమరం భీమ్ (ఆసిఫాబాద్)1990104952.712302181378.764292286266.68
10హైదరాబాద్-III5693320756.336080449173.8711773769865.39
11భద్రాద్రి కొత్తగూడెం3146162951.784354313371.967500476263.49
12నిర్మల్2624131650.153154232073.565778363662.93
13జగిత్యాల2861137548.063784279973.976645417462.81
14నల్గొండ5174276453.426107432270.7711281708662.81
15సూర్యాపేట2868146351.013741267471.486609413762.60
16మహబూబ్ నగర్4120204049.514862354672.938982558662.19
17హైదరాబాద్-II18618966451.91183791333772.57369972300162.17
18జోగులాంబ గద్వాల153973047.431943143173.653482216162.06
19సంగారెడ్డి6861339249.449035639970.8215896979161.59
20యాదాద్రి2580138253.572598174267.055178312460.33
21మంచిర్యాల2424118148.722948205969.845372324060.31
22జనగామ134667049.781849123666.853195190659.66
23వనపర్తి2507117646.912442170869.944949288458.27
24పెద్దపల్లి170466839.202412168269.734116235057.09
25నిజామాబాద్6836293842.988711586867.3615547880656.64
26నారాయణపేట162365140.112270153767.713893218856.20
27నాగర్ కర్నూల్204178438.413312220366.525353298755.80
28మెదక్2460115646.993250200061.545710315655.27
29సిద్దిపేట3050118538.854337278264.157387396753.70
30వరంగల్213372634.043078202665.825211275252.81
31వికారాబాద్3180132041.513528221862.876708353852.74
32ఆదిలాబాద్3773139136.873928251964.137701391050.77
33కామారెడ్డి3286120036.523945237260.137231357249.40
34మహబూబాబాద్147253736.481684101360.153156155049.11
35రాజన్న సిరిసిల్ల130236528.032274138961.083576175449.05

తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాల వారీగా ప్రదర్శనను గమనిస్తే, పట్టణ ప్రాంత జిల్లాలు దూసుకెళ్లగా, కొన్ని గ్రామీణ ప్రాంతాల జిల్లాలు అట్టడుగున నిలిచాయి. 

అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి 5 జిల్లాలు:

  • మేడ్చల్: 77.31 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బాలికలు (82.47%) బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. 
  • రంగారెడ్డి: 76.38 శాతంతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 
  • జయశంకర్ భూపాలపల్లి: ఈ జిల్లా 73.04 శాతంతో మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.  బాలికలు 78.72 శాతం పాస్ కాగా, బాలురు 66.72 శాతం మంది పాసయ్యారు. 
  • ఖమ్మం: 72.06 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలిచింది.   
  • ములుగు: 71.31 శాతంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ బాలికల ఉత్తీర్ణత ఏకంగా 82.03 శాతంగా నమోదైంది. ఒకవేళ బాలురు మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే ఏజెన్సీ జిల్లా టాప్ 2లో చేరేది.

చివరి స్థానాల్లో నిలిచిన 5 జిల్లాలు:

  • రాజన్న సిరిసిల్ల: కేవలం 49.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇక్కడ బాలుర ఉత్తీర్ణత చాలా తక్కువగా (28.03%) ఉంది. 
  • మహబూబాబాద్: 49.11 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా కింద నుండి రెండో స్థానంలో ఉంది. జిల్లాలో బాలురు కేవలం 36.48 శాతం మంది పాసయ్యారు. 
  • కామారెడ్డి: 49.40 శాతంతో మూడో స్థానంలో (చివరి నుండి) నిలిచింది. ఇక్కడ సైతం బాలురు కేవలం 36.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 
  • ఆదిలాబాద్: 50.77 శాతం ఉత్తీర్ణత సాధించి వెనుకబడిన జిల్లాల జాబితాలో చేరింది. బాలికలు 64.13 శాతం పాస్ కాగా, బాలురు 36.87 శాతం మాత్రమే పాసయ్యారు. 
  • వికారాబాద్: 52.74 శాతంతో ఐదో స్థానంలో (చివరి నుండి) నిలిచింది.