TS Inter Supplementary Exams 2024 Dates: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 60.01 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాలలో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 





ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి అగ్రస్థానంలో నిలవగా, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకూడదని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు.  మే 24వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.


 



ఇంటర్ పాసైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, అవసరమైతే ప్రింటౌట్ తీసుకుని వారి వద్ద భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవాలని సూచించారు. పేపర్ రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్ కు రూ.100 చెల్లించాలని అధికారులు సూచించారు. అదే విధంగా వాల్యుయేషన్ చేసిన పేపర్ స్కాన్ కాపీతో పాటు రీ వెరిఫికేషన్ కోసం రూ.600  ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో మే2వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.