TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. సొంతూళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవడం కష్టమేనని పరీక్షలు వాయిదా వేస్తారని అంతా భావించారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో.. తెలంగాణ ఎంసెట్ 2022 అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షా తేదీలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ విభాగం పరీక్షా తేదీలలో ఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.


అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం పరీక్షలు వాయిదా.. 
తెలంగాణలో జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్ ఎంసెట్ పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను షెడ్యూల్ ప్రకారం యథాతథంగా నిర్వహించనున్నారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ 2022 పరీక్షలు నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.


ఎంసెట్ వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి
వెబ్‌సైట్ హోం పేజీలో 'Hall Ticket Download' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేయండి
స్క్రీన్‌పై హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది
హాల్ టికెట్‌పై  అభ్యర్థి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి 
హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింగ్
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET22_GetHT2022gkt.aspx#


ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు
మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ 2022లో వచ్చిన మార్కులతోనే విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకును కేటాయిస్తారు. ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్(EAMCET) ప‌రీక్షను జేఎన్‌టీయూ, హైద‌రాబాద్‌ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి.