పోతురాజు ఇచ్చిన మజ్జిగ తులసి తాగుతుంది. అవే మజ్జిగ లాస్యకి కూడా ఇస్తే అవి ఎవరు చూడకుండా పారబోసి తాగినట్టు నటిస్తుంది. మజ్జిగ తాగిన కూడా తులసి మామూలుగా ఉంది ఏంటి అని అనుకుంటారు. కాసేపటికి తులసికి కళ్ళు తిరగడం మొదలవుతుంది అది చూసి లాస్య వాళ్ళు సంబరపడతారు. నాకు ఏదోలా ఉందని తులసి భయపడుతుంది కానీ వసుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తారు. తులసి జాగ్రత్తగా బోనం కిందపడకుండా అమ్మవారికి సమర్పిస్తుంది అది చూసి లాస్య కుళ్ళుకుంటుంది. ఇక లాస్య బోనం సమర్పించేందుకు వస్తూ కిందపడబోతుంటే తులసి పట్టుకుంటుంది.
బోనం జరిగే దగ్గర జోగిని తులసిని చూస్తూ నీ జీవితం మారిపోబోతుంది. అతి త్వరలో నీ జీవితంలో కొత్త రంగులు, కొత్త సంతోషాలు, కొత్త మనిషి రాబోతున్నాడు. ఆ కొత్త మనిషి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు(అప్పుడే మొగలి రేకులు సీరియల్ హీరో ఇంద్రనీల్ ని చూపిస్తారు). నీ చిక్కు ముడులు విప్పబోతున్నాడు. నర దిష్టి నాశనం అవుతుంది. నీ భవిష్యత్ బంగారంలా ఉండబోతుంది. ఏడిపించే వాళ్ళు ఏడుస్తూ వెళ్లిపోతారు. నన్ను నమ్ముకో సరైన నిర్ణయాలు తీసుకో నీ వెంట ఉంది నేను నడిపిస్తాను' అని చెప్తుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి లాస్య ఇలా జరిగిందని భాగ్య అంటుంది. ఇక అక్కడికి వసు వచ్చి చెడపకురా చెడేవు అని లాస్య వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. 'తులసి ఆంటీ ని బోనం ఎత్తకుండా చేద్దామని అనుకున్నారు, మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపారు. మీరు ఆ మాటలు అనుకున్నపుడు నేను విన్నాను. మీ చెడు మీకే తగిలింది. మంచితనం అంటే తులసి ఆంటీ. రాయి రూపంలో ఉన్న అమ్మవారికి తులసి రూపంలో ఉన్న అమ్మవారికి తేడా లేదు అది తెలుసుకోండి' అని చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: ఆఫీసర్ సారె మీ నాయన అని దేవికి చెప్పనున్న రాధ - సత్య కంట మరో నిజం, అదిత్యపై అనుమానం
ఆల్బమ్ చేయాలనుకున్న ఆలోచన డ్రాప్ చేద్దామనుకుంటున్న అని ప్రేమ్ చెప్పడంతో శ్రుతి షాక్ అవుతుంది. అదేంటి ప్రేమ్ ఎందుకు అలా చేస్తున్నావని శ్రుతి అడుగుతుంది. దీని అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా అని చప్పడంతో శ్రుతి కోప్పడుతుంది. డబ్బు కోసం మనం ఎంత ప్రయత్నించాం ఇప్పుడు ఆ డబ్బు ఎవరికో దానం చేస్తానంటే నేను ఒప్పుకోను అని ఎదురు తిరుగుతుంది. నేను ఈ డబ్బు ఇద్దామని అనుకుంది అమ్మకే అని చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయడానికి అమ్మ డబ్బు కోసం ఇబ్బంది పడుతుంది అందుకే ఆ డబ్బుని అమ్మకే ఇస్తానని చెప్పడంతో శ్రుతి అందుకు సరే అంటుంది. మ్యూజిక్ స్కూల్ పెట్టేందుకు అనసూయ ఐడియా చెప్తుంది. ఏదో ఒక స్కూల్ వాళ్ళు మనకి ఒక గది అద్దెకు ఇస్తే అందులో మనం మ్యూజిక్ స్కూల్ పెట్టుకొవ్వచ్చు కదా అని చెప్తుంది. అందుకు తులసి సరే అంటుంది. ఇక తులసి డాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి ఒక గది అద్దెకు ఇస్తే అందులో మ్యూజిక్ స్కూల్ పెట్టుకుంటానని అడుగుతుంది. మీ ఆలోచన బాగుంది స్కూల్ కి రమ్మని చెప్తుంది.
తరువాయి భాగంలో..
అనసూయ, పరంధామయ్య పోలీసు స్టేషన్ లాకప్ లో ఉంటారు. ఒక వ్యక్తి పోలీసు దగ్గర నుంచి గన్ తీసుకుని తులసి తలకి గురిపెట్టి నా హనీనే కిడ్నాప్ చేస్తావా అని కోపంతో ఊగిపోతాడు.