Kamareddy:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్పుల వివరాలు కింద ఉన్నాయి:

దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించిన రైళ్ల వివరాలు:

  • 17606 భగత్ కీ కోఠీ – కాచిగూడ రైలు: ఈ రైలు నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట, మౌలాలి మీదుగా కాచిగూడకు చేరుకుంటుంది. ఇది నిర్ణయించిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది
  • 17057 ముంబై CSMT – లింగంపల్లి రైలు: ఈ రైలు నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు కామారెడ్డి, అక్కన్నపేట, మీర్జాపల్లి, బొలారం స్టేషన్లలో ఆగదని రైల్వే శాఖ తెలిపింది.
  • 17058 లింగంపల్లి – ముంబై CSMT రైలు: ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా వెళుతుంది. బొలారం, మీర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి స్టేషన్లలో వర్షం కారణంగా ఈ రైలు ఆగదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
  • 16734 ఓఖా – రామేశ్వరం రైలు: ఈ రైలు నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట, మౌలాలి, కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది. వర్షం వల్ల కామారెడ్డి స్టేషన్‌లో ఈ రైలు ఆగడం లేదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

వర్షం కారణంగా రద్దయిన రైళ్లు ఇవే:

  • 12794 నిజామాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు పూర్తిగా రద్దు చేయబడింది.
  • 57301 కాచిగూడ – మెదక్ రైలు: ఈ రైలు మీర్జాపల్లి - మెదక్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. మిగతా మార్గంలో రైలు యథావిధిగా నడుస్తుంది.