TPCC New Committiees :    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీలను ప్రకటించారు. మొత్తం పద్దెనిమిది మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మొత్తం 22 మంది సభ్యులు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉన్నారు. వీరిలో నిన్నటి వరకూ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసినట్లయింది.


పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాణిగం ఠాగూర్ చైర్మన్ కాగా... రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల, ఉత్తమ్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నర్సింహ, రేణుకాచౌదరి, బలరాంనాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అజారుద్దీన్, అంజన్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నందున వారికి కూడా చోటు లభించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు టీ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ప్రకటించారు. టీ పీసీసీ అధ్యక్షుడు చైర్మన్‌గా మొత్తం నలభై మంది సభ్యులు ఇందులో ఉన్నారు.



మొత్తంగా పీసీసీ కార్యవర్గంలో 24 మంది ఉపాధ్యకుల్ని నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఏకంగా 84 మందికి  పదవులు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు పట్టుబట్టి తమ వారికి కిటీల్లో చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది.  


జిల్లా అధ్యక్షులు ఎవరెవరంటే ?


అధ్యక్షులు - జిల్లా కాంగ్రెస్ కమిటీ
1.  సాజిద్ ఖాన్ - ఆదిలాబాద్
2.  పొడెం వీరయ్య - భద్రాద్రి కొత్తగూడెం
3.  ఎన్. రాజేందర్ రెడ్డి - హన్మకొండ
4.  వలీవుల్లా సమీర్ - హైదరాబాద్
5.  ఎ. లక్ష్మణ్ కుమార్ - జగిత్యాల్
6.  పటేల్ ప్రభాకర్ రెడ్డి - జోగులాంబ గద్వాల్
7.  కైలాస్ శ్రీనివాస్ రావు - కామారెడ్డి
8.  డాక్టర్ కె. సత్యనారాయణ - కరీంనగర్
9.  డాక్టర్ సి. రోహిన్ రెడ్డి - ఖైరతాబాద్
10.  జె. భరత్ చంద్ర రెడ్డి - మహబూబాబాద్
11.  జి. మధుసూధన్ రెడ్డి - మహబూబ్ నగర్
12. కె. సురేఖ - మంచిర్యాల
13.  టి.తిరుపతి రెడ్డి - మెదక్
14.  నందికంటి శ్రీధర్ - మేడ్చల్ మల్కాజిగిరి
15.  ఎన్. కుమార స్వామి - ములుగు
16.  డాక్టర్ సి. వంశీ కృష్ణ - నాగర్ కర్నూల్
17.  టి.శంకర్ నాయక్ - నల్గొండ
18.  శ్రీహరి ముదిరాజ్ - నారాయణపేట
19.  ప్రభాకర్ రెడ్డి - నిర్మల్
20.  మానాల మోహన్ రెడ్డి - నిజామాబాద్
21.  ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ - పెద్దపల్లి
22.  ఆది శ్రీనివాస్ రాజన్న - సిరిసిల్ల
23.  టి.నర్సా రెడ్డి - సిద్దిపేట
24.  టి. రాంమోహన్ రెడ్డి - వికారాబాద్
25.  ఎం. రాజేందర్ ప్రసాద్ యాదవ్ - వనపర్తి
26.  కె. అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి -  భువనగిరి


టీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎవరెవరు అంటే ?


ఉపాధ్యక్షులు
1.   పద్మావతి రెడ్డి
2.   బండ్రు శోభా బాస్కర్
3.   కొండ్రు పుష్పలీల
4.   నేరళ్ల శారద గౌడ్
5.   సీహెచ్ప. విజయ రమణారావు
6.   చామల కిరణ్ రెడ్డి
7.   చెరుకు సుధాకర్ గౌడ్
8.   దొమ్మాటి సాంబయ్య
9.   డా. శ్రావణ్ కుమార్ రెడ్డి
10.   ఎర్ర శేఖర్
11.   జి. వినోద్
12.   గాలి అనిల్ కుమార్
13.   హర్కర వేణుగోపాలరావు
14.   జగదీశ్వర్ రావు. ఎస్
15.   మధన్ మోహన్ రావు
16.   మల్‌రెడ్డి రంగారెడ్డి
17.   MRG వినోద్ రెడ్డి
18.   ఒబేదుల్లా కొత్వాల్
19.   పొట్ల నాగేశ్వరరావు
20. రాములు నాయక్
21.   సంజీవ రెడ్డి
22.   సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ
23.   టి. వజ్రేష్ యాదవ్ (జంగయ్య)
24.   తాహెర్బిన్ రాంధాని