Top Headlines on March 24th In Telugu States:


1. బీఆర్ఎస్ కు మరో షాక్


బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14 లో ఓ భూ వివాదానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో సంతోష్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


2. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం


తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శనివారం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ (Hyderabad) సెక్యూరిటీ విభాగం అడిషనల్ డీసీపీ తిరుపతన్న అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (SIB Former DSP Praneeth Rao) వెల్లడించిన వివరాల ఆధారంగా ఆ పోలీస్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం భుజంగరావు, తిరుపతన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


3. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ అలర్ట్


అకాల వర్షాలతో గత వారంలో నాలుగైదు రోజులు భానుడి భగభగలు తగ్గాయి. కానీ వేసవికాలం కావడంతో సూర్యుడి తీవ్రత అధికం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు 3 వారాల నుంచి ఎండలకు రాయలసీమ మండిపోతోంది. శనివారం (మార్చి 23న) దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అనంతపురంలో 40.8 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


4. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే


ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం హ్యాండిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


5. బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం


విజయవాడలో శాంతి భద్రతల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఓ పెద్ద ఉదాహరణ. అదేమీ మారుమూల ప్రాంతం కాదు, నగరానికి కిలోమీటర్ల దూరంలో ఏమీ లేదు, పోనీ జనసంచారం లేని ప్రాంతమా అంటే అదీ కాదు. అన్నీ ఉన్నాయి, నిఘా కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. కానీ అక్కడ బ్లేడ్ బ్యాచ్ వీరంగానికి పోలీసులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. విజయవాడ నడిబొడ్డున పండిట్ నెహ్రూ బస్టేషన్ లో జరిగిందీ వ్యవహారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.