Telangana 10th Leak :  తెలంగాణలో టెస్త్ పరీక్షల ప్రారంభం రోజునే తాండూరులో  ప్రశాపత్రం బయటకు రావడం  కలకలం రేపింది. అసలే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల విషయంలో రాజకీయంగా రచ్చ జరుగుతున్న సమయంలో టెన్త్ పేపర్ లీకేజీ తలనొప్పిగా మారింది. వెంటనే  అధికారులు స్పందించారు. తాండూరులోని ప్రభుత్వ నెంబర్(1) పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు బందెప్ప పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. బందెప్పకు పైన పేర్కొన్న ప్రభుత్వ పాఠశాలలో ఇన్విజిలేటర్  గా విధుల్లో ఉన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతో పాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. బయటకు లీక్ చేసిన బందెప్పతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో ఇద్దర్ని కూడా సస్పెండ్ చేఏశారు. 
 
ప్రశ్నాపత్రాలు ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు భద్రత మధ్య తీసుకవస్తారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లో విడదీస్తారు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరు.   ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్ ఫోన్ ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లారు. దీనికి పై అధికారుల  నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు.   తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన బందెప్పను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు. 


ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో బయటకు పంపిన బందెప్పకు వివాదాస్పద చరత్ర ఉంది.   పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో పోక్సో చట్టం కింద  కేసు నమోదు అయింది.   పరీక్షకు ముందు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తే లీక్ అవుతుందని.. పరీక్ష ప్రారంభం తరువాత బయటకు వస్తే నిర్వహణ లోపంగా పేర్కొంటారని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ పేపర్ లీకేజీ అంశంపై ఉన్నపళంగా పోలీసులు విచారణ ప్రారంభఇంచారు.  వికారాబాద్ కలెక్టరేట్లో డీఈవో, విద్యాశాఖ అధికారులు సమావేశం అయ్యాయి.                                    


పరీక్షకు ముందే వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టిందంటూ పలు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.. విద్యార్థులను కంగారు పెట్టడానికి రకరకాల ప్రచారాలు చేస్తారని అవేమీ పట్టించుకోవద్దని.. పరీక్షల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నిజానికి ఇలా పరీక్ష ప్రారంభమైన తర్వాత  పేపర్లు బయటకు రావడం అనేది ఇటీవలి కాలంలో పెద్ద సమస్య అయింది. గత ఏడాది ఏపీలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. దీనికి కారణం  అంటూ నారాయణ స్కూల్స్  ఓనర్ మాజీ మంత్రి నారాయణపై అక్కడి ప్రభుత్వం కేసు పెట్టింది. అయితే ఇలా పేపర్ బయటకు రావడం లీక్ కాదని.. అక్కడి ఉపాధ్యాయులు వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.