TSPSC News :  మొదట పేపర్ లీక్.. తర్వాత కాపీయింగ్.. తర్వాత మాల్ ప్రాక్టీస్ ఇలా చెప్పుకుంటూ పోతే టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ అరెస్టులు చూపిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం నుంచే కాకుండా వివిధ పరీక్షా కేంద్రాల నుంచి కూ డా పేపర్లు బయటకు వెళ్లాయని చెప్పి తాజాగా  కీలక సూత్రధారిగా విద్యుత్‌ శాఖ డీఈ రమేష్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనను కస్టడీకి తీసుకుని అసలు కుట్రను బయటకు లాగాలని అనుకుంటున్నారు. 


బయట లీకులు కూడా ఉన్నట్లు గుర్తించిన సిట్                                     


డీఈఈ రమేష్‌ హైదరాబాద్‌లోని లంగర్‌ హౌజ్‌ ప్రాంతానికి చెందిన ఓ పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆయన ద్వారా ప్రశ్న పత్రాలను తెప్పించారు.  పరీక్ష ప్రారంభమైన ఐదు నిముషాల్లోనే రమేష్‌కు వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం చేరేదని వెంటనే ఆయన సమాధానాలు సిద్ధం చేసి ఎంపిక చేసిన అభ్యర్థులకు బ్లూటూత్‌ ద్వారా చేరవేసేవారని సిట్ గుర్తించింది.  సమాధానాలు సిద్ధం చేసేందుకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, మలక్‌పేటలలో రమేష్‌ రెండు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నరాు.  వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం చేరవేసినందుకు ఇన్విజిలేటర్‌ తో రమేష్‌ ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించినట్టు గుర్తించారు.  
   
పరీక్ష ప్రారంభమైన తర్వాత లీకేజీపై సిట్ దృష్టి                      


పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపో యేలా బఠాణి గింజంత స్పీకర్‌ అమర్చి వాటి ద్వారా సమాధానాలను చేరవేసి నట్టు  సిట్‌ గుర్తించింది. పరీక్ష అనంతరం చెవిలో నుండి దాన్ని బయటికి తీసేందుకు మ్యాగ్నటిక్‌ పరికరాన్ని విని యోగించినట్లు నిర్ధారించారు.    ఇప్పటివరకు పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ 43 మందిని అరెస్టు చేసింది. పేపర్‌ లీకేజీ తో సంబంధం ఉన్న 50 మందిని కమిషన్‌ డిబార్‌ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వినియోగం బట్టబయలు కావడం సంచలనంగా మారింది. ఈ హైటె-క్‌ వ్యవహారమంతా.. మలక్‌పేట్‌ కేంద్రంగా కొనసాగినట్లు- సిట్‌ అధికారులు గుర్తించారు. 


అసలు కేసు ఎటు పోతోంది ? మూలాలు దొరుకుతాయా ? 


మలక్‌పేట్‌ నుంచి పరీక్ష హాల్‌లోని అభ్యర్థులకు మైక్రో వైర్‌లెస్‌ పరికరం ద్వారా రమేష్‌ బృందం సమాధానాలు చెప్పారు. రమేష్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరికి మొత్తం 40 మందికి ఏఈ పేపర్‌ చేరింది. ఈ 40 మంది అభ్యర్థులను గుర్తించే పనిలో సిట్‌ బృందం పడింది.   కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉంట-న్న డీఈ రమేష్‌పై గతంలోనూ పలు రకాల కేసులు ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఇన్ని కోణాలు వెలుగులోకి వస్తూంటే.. అసలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచి కకయిన కేసు వెనక్కి పోతుందేమో అన్న ఆందోళన కొంత మందిలో వ్యక్తమవుతోంది.