Father Did Daughter Funeral While She Still Alive: ఓ తండ్రి కన్నీటి గాథ ఇది.. గుండె మాటున ఆవేదన ఇది. 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి.. తనే ప్రాణంగా చూసుకున్న తండ్రిని కాదని ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆ తండ్రి మనసు విరిగిపోయి తన కూతురికే షాక్ ఇచ్చాడు. ఆమె బతికుండగానే శ్రద్ధాంజలి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దాన్ని ఇంటి ముందే కట్టి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి బంధువులందరికీ తన కూతురు చనిపోయిందని చెప్పాడు. తీవ్ర మనస్తాపంతో చేసిన ఆ తండ్రి చేసిన పనికి బంధువులతో పాటు స్థానికులూ షాక్ అయ్యారు. ఇదీ తీవ్ర చర్చనీయాంశమై వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. పట్టణంలో చిలువేరి మురళి కుమార్తె అనూష్ణ.. ఓ అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్ గు గురయ్యారు. తమ కూతురు అలాంటి పని చేయదని.. తన బిడ్డను మభ్య పెట్టి ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. కంటికి రెప్పలా చూసుకున్న కూతురు అలా చేయడంతో తట్టుకోలేని ఆ తండ్రి తీవ్ర మనస్తాపంతో కూతురికే షాక్ ఇచ్చాడు. ఇంటి ముందే ఆమె శ్రద్ధాంజలి ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బంధువులు అందరికీ తన కూతురు చనిపోయిందని చెప్పాడు. తీవ్ర మనస్తాపం, ఆవేదనతో ఆ తండ్రి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 'అమ్మలారా.. అయ్యలారా.. నా బిడ్డ వెళ్లిపోయింది. మంచిగా కాలేజీలో చదువుతోన్న అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. అమ్మా ఎవరూ ఇలా చేయకండి. మీ తల్లిదండ్రులను మోసం చేయకండి. మీ కాళ్లు మొక్కుతా.' అంటూ ఆ తండ్రి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.