TGSRTC Special Buses: భక్తుల అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలంకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు బస్సుల వివరాలను వీసీ సజ్జనార్ వెల్లడించారు.
‘‘తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఈ నెల 21న గురు పౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు’’ అని వీసీ సజ్జనార్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.