Donald Trump Rally Shooting: అమెరికా మాజీఅధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిపిన ఘటన సంచలనం కలిగించింది. ఈ దాడిలో ఆయన చెవికి గాయమైంది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావు లేదని తేల్చి చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
"అమెరికా మాజీఅధ్యక్షుడు ట్రంప్ పై దాడి నన్నెంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజాస్వమ్యంలో, రాజకీయాల్లో ఈ హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈఘటనపై స్పందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం చేయడం తననెంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి దాడుల్ని కచ్చితంగా ఖండించాలని తేల్చిచెప్పారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.