schedule for Telangana Inter exam fee payment | హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫీజు గడువు తేదీలను వెల్లడించింది. లాగ్ విద్యార్థులు((జనరల్, వొకేషనల్) లతో పాటు ఆర్ట్స్/ హ్యూమానిటీస్ గ్రూప్ విద్యార్థులలో హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 26 వరకు ఎగ్జామ్ ఫీజును చెల్లించే అవకాశం కల్పించింది.


తెలంగాణలో ఇంట‌ర్ ఎగ్జామ్ ఫీజులు ఈ నెల 6వ తేదీ నుంచి 26 చెల్లించాలి. ఈ గడువులోగా చెల్లించలేని వారు రూ. 100 ఆల‌స్య రుసుము (Inter Exam Late Fee)తో న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు చెల్లించే అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డ్. డిసెంబ‌ర్ 5 నుంచి 11 వ‌ర‌కు రూ. 500 ఆల‌స్య రుసుముతో, డిసెంబ‌ర్ 12 నుంచి 18 వ‌ర‌కు రూ. 1000 ఆల‌స్య రుసుముతో, డిసెంబ‌ర్ 19 నుంచి 27 వ‌ర‌కు రూ. 2000 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు అని విద్యార్థులకు బోర్డు సూచించింది. 


ఎగ్జామ్ ఫీజు ఎవరికి ఎంత..
ఫ‌స్టియ‌ర్ జ‌న‌ర‌ల్ కోర్సు ఎగ్జామ్ రాసే విద్యార్థులు రూ. 520, వొకేష‌న‌ల్ కోర్సు పరీక్షలకు రూ. 750, ఇంటర్ సెకండియ‌ర్ జ‌న‌ర‌ల్ ఆర్ట్స్ కోర్సుల‌కు రూ. 520 చెల్లించాలని, సైన్స్, వొకేష‌న‌ల్ కోర్సుల‌కు రూ. 750 ఎగ్జామ్ ఫీజుగా ఇంటర్ బోర్డు నిర్ధారించింది. విద్యార్థులు ఆయా తేదీలను గమనించి ఆలస్య రుసుము గడువుకు ముందే ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని సూచించింది.


ఫీజు చెల్లింపు తేదీలు
ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేదీ: 06.11.2024
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.11.2024
ఆలస్య రుసుము రూ.100/ తో ఫీజు చెల్లించడానికి తేదీ: 27.11.2024 నుంచి 04.12.2024 వరకు
ఆలస్య రుసుము రూ.500/ తో ఫీజు చెల్లించడానికి తేదీ: 05.12.2024 నుంచి 11.12.2024 వరకు
ఆలస్య రుసుము రూ.1000/ తో ఫీజు చెల్లించడానికి తేదీ: 12.12.2024 నుంచి 18.12.2024 వరకు
కోర్సు ఫీజు వివరాలు ఇక్కడ చూడండి


ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ స్టూడెంట్స్: రూ.520/-
ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520+ ప్రాక్టికల్స్ 230) రూ.750/-
సెకండియర్ జనరల్ ఆర్ట్స్: రూ.520/-
సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) రూ.750/-
పూర్తి వివరాలు కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ వీక్షించాలని విద్యార్థులకు సూచించింది.


Also Read: World Record: పది వేల మంది విద్యార్థులు- 600 మ్యాథ్స్‌ ఫార్ములాలు- ప్రపంచ రికార్డు దిశగా చిన్నారుల ప్రయత్నం