Top Headlines on Today 18th November:
డీహైడ్రేషన్ వల్లే ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత - వెంటనే ప్రచారంలోకి!
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే… కాసేపటికి మళ్ళీ తేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డీ హైడ్రేషన్ కారణంగా కవిత అస్వస్థతకు గురయ్యారని.. అంతకు మించిన అనారోగ్యం ఏమీ లేదని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీలో మందుబాబులకు షాక్ - మరోసారి పెరిగిన మద్యం ధరలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరోసారి మద్యం (Liquor) ధరలు పెరిగాయి. అంతేకాదు పెరిగిన ధరలు ఇవాళ్టి (శనివారం) నుంచే అమల్లోకి కూడా వచ్చేశాయి. క్వార్టర్‌పై 10 రూపాయలు... ఫుల్‌బాటిల్‌పై 20 రూపాయలు పెంచేసింది ఏపీ ప్రభుత్వం. ఇక.. ఫారిన్ లిక్కర్‌పై అయితే ఏకంగా 20శాతం వరకు ధరలు పెంచేశారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిజంగా షాకే అంటున్నారు మందుబాబులు. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ఎక్సైజ్ శాఖ. ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవు. కనుక... అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చింది ఎక్సైజ్ శాఖ. దీని వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పన్నుల భారం ఒకేలా పడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే' - విజయశాంతి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకుంటామని, అరెస్టు చేస్తామని చెప్పినందునే బీజేపీలో చేరానని కానీ ఇప్పుడు బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిందన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. రెండు రోజుల కిందటి వరకూ బీజేపీలో ఉన్న ఆమె ఆమె.. రాజీనామా చేసి మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరానని పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ పెద్ద తప్పు చేయడమేన్నారు. ఉద్యమ నాయకురాలుగా , పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ నాయకురాలుగా ఉన్నానని.. రాష్ట్రమే ముఖ్యమని 25 సంవత్సరాలు పనిచేశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ విడిచి బీజేపీ కి వెళ్ళడానికి కారణం.. కేసీఆర్ అవినీతిపరుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందన్నారు. కేసీఆర్ పై చర్యలు తోడుకుంటారన్న నమ్మకం తో బీజేపీ లో చేరామన్నారు. నెలలు ,సంవత్సరాలు గడిచిన కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదనన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఏపీ వ్యాప్తంగా 13 భారీ స్క్రీన్లు
ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS Final 2023) మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి (Gopinath Reddy) తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తి ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో ఎస్సీ యువకుడి ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం - హోంమంత్రి తానేటి వనిత వెల్లడి
తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర (Bontha Mahendra) ఆత్మహత్యపై సీఐడీ విచారణ (CID Enquiry)కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఆదేశించినట్లు హోంమంత్రి తానేటి వనిత (Taneti Vanitha) తెలిపారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని మంత్రి విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.