MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు  అస్వస్థత చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్.  ఈ సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే… కాసేపటికి మళ్ళీ తేరుకొని ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. డీ హైడ్రేషన్ కారణంగా కవిత అస్వస్థతకు గురయ్యారని.. అంతకు మించిన అనారోగ్యం ఏమీ లేదని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. 


చివరి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగం - బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనే సంగతి కేసీఆర్ మర్చిపోతున్నారా ?


తన ఆరోగ్యంపై కవిత కూడా స్పందించారు. కొద్దిగా ఆందోళన అనిపించినా ఇబ్బందేమీ లేదన్నారు. ఓ చిన్న పాపతో మాట్లాడుతున్న వీడియోను పోస్టు చేసి.. ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.                                                                                    


 







ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో హఠాత్తుగా పడిపోవడంతో..  బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందాయి. ఎండలు ఎక్కువగా ఉండటం.. అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొంటూ ఉండటంతో అసలటతో డీ హైడ్రేషన్ కు గురుయినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు అందరూ ఆందోళన చెందుతూడటంతో  వెంటనే ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తర్వాత స్థానిక బీఆర్ఎస్ నేత ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఇబ్బంది లేదని..ఆందోళన అవసరం లేదని కవిత స్పష్టత ఇచ్చారు.                            


కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మేనిఫెస్టో - ఆ వర్గాలే లక్ష్యంగా హామీల వర్షం, అధికారం అందేనా!


ఇటీవల ఎన్నికల ప్రచారంలో  మంత్రి కేటీఆర్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రచార వాహనంపై నుంచి ఒక్క సారిగా కిందపడబోయారు. డ్రైవర్ సజెన్ బ్రేక్ వేయడంతో.. ప్రచారవాహనం  పైన ఉన్న రెయిలింగ్ ఒక్క సారిగా కుంగిపోయింది. నేతలంతా ముందుకు వంగారు. ఎంపీ సురేష్ రెడ్డి కిందపడిపోయారు. అయితే కేటీఆర్ మాత్రం.. ఆగగలిగారు.